Site icon NTV Telugu

Tiger NageswaraRao: రవితేజ కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్

megastar

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర సినిమాలతో పాటు రవితేజ నటిస్తున్న మరో చిత్రం టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటిస్తున్నారు.

ఇక ఏప్రిల్ 2వ తారీకున ఈ సినిమా ముహూర్తంను, టైగర్ నాగేశ్వరరావు లుక్ ను రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో సర్ ప్రైజ్ అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు ఓపెనింగ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఆ వేడుక ఎప్పుడు జరగనుందో ఏప్రిల్ 2 న తెలియజేయనున్నారు. ఇకపోతే రవితేజ, చిరు నటిస్తున్న మెగా 154 లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version