Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మారింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఒంగోల్ లోని ‘ఏబీఏం కాలేజ్ గ్రౌండ్స్’ లో జరగాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఇబ్బందులు రావడంతో ‘అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్స్’కి మార్చారు. వీర సింహా రెడ్డి దారిలో నడుస్తూ మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికని కూడా మేకర్స్ మార్చారు. జనవరి 8న ఆర్కే బీచ్ లో జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. అయితే అధికారుల సూచన మేరకు ఆర్కే బీచ్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చెయ్యడానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు. చిరు, రవితేజ లాంటి స్టార్ హీరోలు రానున్న ఈవెంట్ అంటే అది ఎంత గ్రాండ్ గా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రభుత్వంతో తలనొప్పి ఎందుకు అనుకుందో ఏమో కానీ మారింది ప్లేసులే కదా ఊర్లు కాదు కదా అనుకోని రెండు సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్ ని అధికారులు సూచించిన చోటే చేసేస్తున్నారు.
ఆర్కే బీచ్ లో వాల్తేరు వీరయ్య ప్రీఈవెంట్ వేదిక దాదాపు పూర్తియిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారాలు వేదిక మార్చమని చెప్పడం నిర్వాహకులకి ఖర్చుని పెంచే విషయమే. ఇదిలా ఉంటే ప్రీరిలీజ్ ఈవెంట్ కి సెక్యూరిటీగా వచ్చే బందోబస్తు పోలీసులకి ఒక రోజు జీతం, 5000 కార్లు మాత్రమే పార్కింగ్ అంటూ కొన్ని నిబంధనలని ఏపీ అధికారులు పెడుతున్నారు అనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కానీ ఆంధ్రాలో సినిమా ఈవెంట్స్ చెయ్యండి, షూటింగ్స్ చెయ్యండి, స్టూడియోలు పెట్టండి అనే నాయకులు అందుకు తగ్గ వాతావరణాన్ని కూడా మైంటైన్ చెయ్యాల్సి ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలి. అప్పుడే చిత్ర పరిశ్రమ ఏపీలో సినిమా పనులు చేసుకోగలదు లేదంటే చిత్ర పరిశ్రమ ఎప్పటికీ తెలంగాణా వరకే పరిమితం అవుతుంది ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వం సినిమాకి సంబంధించిన పనులకి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కలిపిస్తుంది.
Also Read
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!