వాల్తేరు వీరయ్య సినిమాతో అమలాపురం నుంచి అమెరికా వరకూ రీసౌండ్ వచ్చే రేంజులో హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. మాస్ థియేటర్, క్లాస్ థియేటర్ అనే తేడా లేకుండా ప్రతి చోటా మెగా మేనియా వినిపిస్తూనే ఉంది. కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 12-0 కోట్ల వరకూ గ్రాస్ ని రాబట్టింది అంటే వాల్తేరు వీరయ్య సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఊహించొచ్చు. ఈ హిట్ ఇచ్చిన జోష్ లో నుంచి బయటకి వచ్చి కాస్త రెస్ట్ కూడా తీసుకోకుండా తన నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టేసాడు మెగాస్టార్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోలా శంకర్’ సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయ్యింది. షూటింగ్ కోసం వేసిన కలకత్తా సెట్ లో భోలా శంకర్ షూటింగ్ జరగనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ… “Continuing the Mega Blockbuster Festive Vibe with High Positive Energy #BholaaShankar New Schedule commences today in a Huge Kolkata set” అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.
Read Also: SSMB 28: రేపటి నుంచే మహేశ్-త్రివిక్రమ్ మూవీ షూటింగ్
తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. కోలీవుడ్ లో అజిత్ నటించిన ‘వేదాలం’ మూవీకి భోలా శంకర్ రీమేక్ వర్షన్. మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ ‘భోలా శంకర్’ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఏప్రిల్ 14న ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నారు. భోలా శంకర్ కూడా హిట్ అయితే చిరు బ్యాక్ బ్యాక్ హిట్ కొట్టి సక్సస్ ట్రాక్ ఎక్కినట్లే అవుతుంది. ఇదే జరిగితే టాలీవుడ్ లో యంగ్ హీరోలు కూడా చిరు బాక్సాఫీస్ రికార్డ్స్ ని మ్యాచ్ చెయ్యడానికి కష్టపడాల్సి వస్తుంది.
https://twitter.com/BholaaShankar/status/1615263684779180033
Read Also: The Boss: అక్కడ ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు…
