Chiranjeevi: ఢిల్లీలో చిరంజీవి మోకాలి నొప్పికి ట్రీట్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megastar Chiranjeevi undergoes a knee wash surgery in New Delhi: మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే భోళా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ భోళా శంకర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ సంగతి అలా ఉంచితే మెగాస్టార్ చిరంజీవి మోకాళ్ళ సర్జరీ చేయించుకోబోతున్నారని వార్తలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ వస్తున్నాయి. ఒకానొక దశలో ఆయన అమెరికా వెళ్ళింది కూడా అందుకేనన్న ప్రచారం జరిగింది. కానీ అమెరికా నుంచి ఇండియా కూడా వచ్చేశారు, అయినా ఆయన మోకాళ్ళ సర్జరీ జరగకపోవడంతో ఈ వార్తలు పుకార్లేమో అనుకున్నారు. కానీ ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి మోకాలి నొప్పికి ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. న్యూఢిల్లీలో ఆర్థోస్కోపి నీ వాష్(knee wash) ట్రీట్మెంట్ చిరంజీవి తీసుకున్నట్లు చెబుతున్నారు.
Anirudh: జైలర్ దెబ్బకి ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్
Also Read
ఈ ట్రీట్మెంట్ తీసుకున్న నేపథ్యంలో ఆయన వారం రోజులు పాటు రెస్ట్ తీసుకోబోతున్నారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ తిరిగి రాబోతున్నారు. ఈనెల 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన హైదరాబాద్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఆరోజు చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవం జరగబోతుందని చెబుతున్నారు. ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహారించనున్నారు. గతంలో బంగార్రాజు, సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా కూడా ఒక రీమేక్ సినిమా అనే ప్రచారం జరుగుతోంది. కానీ అది నిజం కాదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది సినిమా రిలీజ్ అయితే గాని చెప్పలేం.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!