NTV Exclusive: త్వరలోనే ‘మెగా పోడ్కాస్ట్’.. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ రైటర్‌తో చిరంజీవి బిగ్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానులను అలరించిన చిరు.. త్వరలోనే ఒక ప్రతిష్టాత్మక ‘పోడ్కాస్ట్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ టాక్ షో ద్వారా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని అరుదైన అనుభవాలను, ఎవరికీ తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయన పంచుకోనున్నారు. నందమూరి బాలకృష్ణతో ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోను దేశవ్యాప్తంగా నెంబర్ వన్ ట్రెండింగ్ సిరీస్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ రచయిత బి.వి.ఎస్. రవి ఈ ప్రాజెక్ట్‌కు వెన్నుముకగా నిలవబోతున్నారు.
తాజాగా ఎన్టీవీ (NTV Podcast) పోడ్కాస్ట్లో పాల్గొన్న రైటర్ బి.వి.ఎస్. రవి ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన క్రేజీ డీటెయిల్స్‌ను లీక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చిరంజీవి అనే వ్యక్తి ఈ తెలుగు సినీ పరిశ్రమ అనే మహాసముద్రాన్ని అటు నుండి ఇటు, ఇటు నుండి అటు ఒక పదిసార్లు ఈదారు. సున్నా నుండి మొదలై ఆయన చేరుకున్న శిఖరాలు, ఆయన లైఫ్ జర్నీ వెనుక ఉన్న శ్రమను రాబోయే తరాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన జీవితంలో జరిగిన ప్రతీ ముఖ్యమైన అనుభవాన్ని కూలంకషంగా చర్చించేలా ఈ పోడ్కాస్ట్ను డిజైన్ చేస్తున్నాం” అని చెప్పుకొచ్చారు. గతంలో మెగాస్టార్ కుమార్తె సుష్మిత కొణిదెల కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇవ్వగా.. ఇప్పుడు బి.వి.ఎస్. రవి మరింత సమాచారంతో అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. చిరంజీవితో కలిసి గత యాభై ఏళ్లలో పనిచేసిన ఇండస్ట్రీ దిగ్గజాలు, దర్శకులు, నిర్మాతలను ఈ షోకి తీసుకొచ్చి ముచ్చటిస్తారా? లేక చిరు నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల వారీగా ఒక్కో ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తారా? అనే సస్పెన్స్ క్లియర్ కావాలంటే ఇంకా కొన్నాళ్ళు ఆగాల్సిందే!
Also Read
- Peddi Censor Review : 'రంగస్థలం'ను మించిన యాక్టింగ్.... లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
- Peddi : భోపాల్'లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
- WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
- Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
తాజావార్తలు
-
NTV Exclusive: త్వరలోనే ‘మెగా పోడ్కాస్ట్’.. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ రైటర్‌తో చిరంజీవి బిగ్ ప్లాన్!
-
Allu Arjun – Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
-
Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. వెన్నెల కిషోర్ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్
-
Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
ట్రెండింగ్
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!