మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జనవరి 13న రిలీజ్ షెడ్యూల్ అయ్యి ఉన్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా టాకీ పార్ట్ ఇటివలే కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. రెండు సాంగ్స్ బాలన్స్ ఉండడంతో చిత్ర యూనిట్ ఫారిన్ వెళ్లారు. అక్కడ దాదాపు పడి రోజుల పాటు జరిగిన షూటింగ్ లో ‘సాంగ్స్ పార్ట్ ని కంప్లీట్ చేశారు. సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘వాల్తేరు వీరయ్య’ తిరిగి హైదారాబాద్ వచ్చేశాడు.
‘వాల్తేరు వీరయ్య’ మూవీ నుంచి ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి’ అనే సాంగ్ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి రిలీజ్ కానుంది. ఈ మూవీతో చిరుని మాస్ రోల్స్ లో మిస్ అవుతున్నాం అని ఫీల్ అవుతున్న ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి మేకర్స్ రెడీ అయ్యారు. చిరు, రవితేజల మధ్య సీన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేయించేలా ఉంటాయని సమాచారం. ఇదిలా ఉంటే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి బాలయ్య నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా నుంచి గట్టి పోటి ఎదురవుతోంది. ఇద్దరు మాస్ హీరోలు ఒకేసారి థియేటర్స్ లోకి వస్తే ఆడియన్స్ కి అంతకన్నా పెద్ద పండగ ఏముంటుంది. అయితే ఏ హీరోకి ఎన్ని థియేటర్స్ వస్తాయి అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ టాపిక్. మరి ఈ టాపిక్ కి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి.