Chiru: ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళొస్తా… రిటర్న్ వచ్చాక రచ్చ చేద్దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు మెగా స్టార్ చిరంజీవి, అన్నయ్య స్ట్రెయిట్ సినిమా చేస్తే బాక్సాఫీస్ కి బొమ్మ కనిపిస్తదని నిరూపించారు మెగా ఫాన్స్. ఈసారి ఆ హిట్ స్ట్రీక్ మైంటైన్ చేస్తూ చిరు మరో స్ట్రెయిట్ మూవీ చేస్తాడు అనుకుంటే తమిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్ట్ 11న భోళా శంకర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భోళా శంకర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ మధ్య రిలీజ్ చేసిన ‘భోళా మేనియా’ అనే ఫస్ట్ సింగిల్‌లో మెగాస్టార్ తనదైన స్టెప్పులతో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా.. ఈ ఫైర్ మాస్ ఎంటర్టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది, మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి… థియేటర్స్ లో కలుద్దాం అని ట్వీట్ చేశారు మెగాస్టార్.
ఇక భోళా శంకర్ డబ్బింగ్ కంప్లీట్ అవడంతో.. ఫారిన్ ట్రిప్‌కు వెళ్లిపోయారు మెగాస్టార్. సురేఖతో కలిసి షార్ట్ హాలిడే ట్రిప్‌కు వెళ్తున్నాను.. తిరిగొచ్చాక నెక్స్ట్ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతానని అన్నారు. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని క్లారిటీ ఇచ్చేశారు. నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో చేయబోతున్నాడు మెగాస్టార్. ఈ సినిమాని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మించబోతున్నారు. ఈ సినిమా ఒక్క ఫైట్ కానీ విలన్ గాని లేకుండా… మెగాస్టార్ మార్క్ తో హిలేరియస్‌గా రాబోతోంది. ఆగష్టు 22న మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.
Also Read
- Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
- Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
- Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
- Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
Off to US on a short holiday with Surekha to refresh and rejuvenate before I join the shoot of my next, a hilarious family entertainer being produced by @GoldBoxEnt ! pic.twitter.com/rWTihORaWZ
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 7, 2023
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?