Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. నేడు చిరు తల్లి అంజనా దేవి పుట్టినరోజు కావడంతో ఆయన.. తల్లికి అపురూపంగా బర్త్ డే విషెస్ తెలిపారు. నేడు మెగా కుటుంబంలో అంజనా దేవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంజనా దేవికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఐదుగురు సంతానం కలిసి అంజనా దేవితో కేక్ కట్ చేయించారు. ఈ వేడుకల్లో మెగా కుటుంబం మొత్తం పాలు పంచుకుంది. ఈ ఫోటోలను చిరు షేర్ చేస్తూ తన తల్లి మీద ప్రేమను అభిమానులతో పంచుకున్నారు. “మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టిన రోజు. జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ… హ్యాపీ బర్త్ డే అమ్మ” అంటూ చెప్పుకొచ్చాడు.
Prabhas: డార్లింగ్ లగ్జరీ కారులో డైరెక్టర్.. నీకు సెట్ అవ్వలేదు బ్రో
ఇక ఫోటోలలో ఐదుగురు సంతానంతో అంజనా దేవి ఎంతో ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఫోటోలలో పవన్ హాట్ టాపిక్ గా మారారు. బ్లాక్ కలర్ టీ షర్ట్ లో నెరిసిన గడ్డంతో డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. మొన్నటివరకు క్లీన్ షేవ్ తో కనిపించిన పవన్ ఈ ఫోటోలలో కొద్దిగా తెల్ల గడ్డంతో కనిపించదాంతో అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వేడుకల్లో రామ్ చరణ్, ఉపాసన కూడా పాల్గొన్నారు. ఇక మెగా హీరోల కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం చిరు భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు, ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా మారాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ 15 లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టిన రోజు. 💐💐 జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ… 🙏Happy Birthday అమ్మ !! pic.twitter.com/SH2h5HBNN7
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2023