Site icon NTV Telugu

Megastar Chiranjeevi: శబరిమలలో మెగాస్టార్.. డోలిలో వెళ్లి

megastar

megastar

మెగాస్టార్ చిరంజీవి శబరిమల దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం భార్య సురేఖతో కలిసి శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు. “చాలా సంవత్సరాల తర్వాత శబరిమల దర్శనం చేసుకోవడం జరిగింది అని, అయితే భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణం గా, అందరినీ అసౌకర్యం కి గురి చేయకుండా, డోలి లో వెళ్ళవలసి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమ ధార పోస్తున్న ఆ శ్రమైక సోదరులకు నా హృదయాంజలి .. ఈ ప్రయాణం లో ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్, ఫీనిక్స్ గోపి గార్ల కుటుంబాల తోడు మంచి అనుభూతి ను ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిరు పలు సినిమాలలో బిజీగా ఉన్నారు. ఆచార్య సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతుండగా.. బోళా శంకర్, గాడ్ ఫాదర్ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.

Exit mobile version