Site icon NTV Telugu

Mega157 : కేరళలో #Mega157 షూటింగ్

Mega157

Mega157

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ హిట్‌మేకర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ #Mega157 ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు, శ్రీమతి అర్చన సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని అద్భుతమైన లొకేషన్స్‌లో శరవేగంగా జరుగుతోంది.

#Mega157 టీం ప్రస్తుతం కేరళలో ఒక కలర్‌ఫుల్, మెలోడియస్ మాంటేజ్ సాంగ్‌ను చిత్రీకరిస్తోంది. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, నయనతారలు జంటగా కనిపించనున్నారు. పెళ్లి సందడి నేపథ్యంలో రూపొందుతున్న ఈ గీతం పూర్తిగా జాయ్‌ఫుల్, సెలబ్రేటరీ మూడ్‌లో సాగుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో ఈ పాటను అద్భుతంగా కంపోజ్ చేశారు, ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుంది. ఈ షెడ్యూల్‌లో సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ జులై 23, 2025 నాటికి పూర్తవుతుందని సమాచారం.

Exit mobile version