రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో మెగా వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిరు కోరిక, రిక్వెస్ట్ మేరకు మెగా అభిమానుల సంఘాలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేశారు. ఇందులో భాగంగా చిరు అభిమానులు ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటారు.అంతేకాకుండా రక్తదాన శిబిరాన్ని కూడా ప్లాన్ చేశారు. మరో వైపు చిరు సినిమాల పండగ జరుగుతోంది. వరుస సినిమాలతో పాటు వాటి అప్డేట్స్ కుడి రాబోతున్నాయన్న విషయం మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
Read Also : ఎనిమీ : “పడదే” లిరికల్ వీడియో సాంగ్
చిరు సినిమా అప్డేట్ల విషయానికి వస్తే… “లూసిఫర్” తెలుగు రీమేక్ టైటిల్, ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు రివీల్ చేయనున్నారు. రేపు “ఆచార్య” అప్డేట్, “చిరు 154” మూవీ అప్డేట్ రేపు, “చిరు 155” అప్డేట్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు రానుంది. “చిరు 155” టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు బాబీ దర్శకత్వం వహించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్న ‘వేదాళం’ రీమేక్ కు ‘భోళా శంకర్’ అని వార్తలు వస్తున్నాయి. రేపు “ఆచార్య” బృందం మూవీ విడుదలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
#MEGA154 ⚠️
— Mythri Movie Makers (@MythriOfficial) August 21, 2021
Today @ 2:07 PM 💥
MegaStar @KChiruTweets – @dirbobby – @ThisIsDSP 🔥