NTV Telugu Site icon

Mega Princess: పిక్ ఆఫ్ ది డే.. వారసురాలిని చూసి మురిసిపోతున్న మెగా కుటుంబం

Charan

Charan

Mega Princess: ఏ కుటుంబంలో అయినా ఆడపిల్ల అడుగుపెట్టడం అదృష్టమే అవుతుంది. ఇక 11 ఏళ్లు కొడుకు పిల్లల కోసం ఎదురుచుస్తూ ఉన్న తల్లిదండ్రులకు ఒక్కసారిగా మనవరాలిని ఎత్తుకొని ఆడించే అదృష్టం దొరికింది అంటే.. వాళ్ళకళ్ళలో వెల్లివెరిసే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి దంపతులు అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు. చరణ్- ఉపాసన పెళ్లి అయ్యి 11 ఏళ్ళు అవుతుంది. ఇప్పటివరకు వాళ్ళు తల్లిదండ్రులు కాలేదని ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా చిరు ఏ రోజూ కోడలిని కానీ, కొడుకును కానీ తప్పు పట్టింది లేదు. ఇక వారి కోరికను మనసులోనే ఉంచుకున్నారు కానీ.. బయట పెట్టింది లేదు. ఇన్నాళ్లకు వారి కోరిక నెరవేరింది. మెగా ఇంటికి మెగా వారసురాలు వచ్చేసింది. ఆ చిన్నారి పాప పేరు క్లిన్ కారా కొణిదెల గా చిరు నామకరణం చేశాడు. ఎంతో అదృష్టం తో పుట్టిన చిన్నారికి ఆయురారోగ్యాలు ఉండాలని.. లలితా సహస్రనామం నుండి తీసుకోబడిన ఆధ్యాత్మిక పేరును పెట్టినట్లు చిరు తెలిపాడు.

Maga Princes: మనవరాలి పేరును అధికారికంగా ప్రకటించిన చిరంజీవి

ఇక ఈ బారసాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా మెగా కుటుంబం.. క్లిన్ ను ఉయ్యాలలో వేసి..చిన్నారి తల్లిదండ్రులు.. వారి తల్లిదండ్రులతో దిగిన ఒక ఫోటో మరింత వైరల్ గా మారింది. చరణ్ తల్లిదండ్రులు అయిన చిరు- సురేఖ ఒక పక్క.. ఉపాసన తల్లిదండ్రులు అయిన అనిల్ – శోభన మరోవైపు నిలబడి.. మెగావారసురాలిని ఉయ్యాల్లో వేసి.. ముచ్చట తీర్చుకున్నారు. ఇక అందరి కళ్ళల్లో కూడా ఆ ఆనందం కనిపిస్తుంది. ఈ కుటుంబాన్ని చూడడానికి అభిమానుల రెండు కళ్ళు సరిపోవడం లేదంటే అతిశయోక్తి కాదు. సాంప్రదాయ బట్టల్లో చరణ్, ఉపాసన ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతానికి మెగా ప్రిన్సెస్ పేరు తెలియడంతో ఆనంద పడుతున్న అభిమానులు త్వరలో చిన్నారి ఫోటో కూడా చూపించాలని కోరుతున్నారు.

Show comments