మెగా భోగీ సెలబ్రేషన్స్ : వరుణ్ని చూసి కుళ్లుకున్న చిరు.. ఎంత పని చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. నేడు భోగీ కావడంతో ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో కలిసి భోగీ మంటలు వేసి కొత్త యేడాదిని ఆహ్వానిస్తున్నారు. ఇక సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం ఉదయాన్నే లేచి భోగీ మంటల వేడుకల్లో పాల్గొని అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీలో భోగీ సెలబ్రేషన్స్ వినోదంగా జరిగినట్లు తెలుస్తోంది. ఏ పండగ వచ్చినా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి రచ్చ స్టార్ట్ చేయడం తెలిసిందే. ఇక ఈసారి కుర్రాళ్లతో కలిసి చిరు కూడా హంగామా చేశారు. ఉదయాన్నే భోగిమంటలు వేసి, అనంతరం ఇంట్లోవారికి ఎంచక్కా దోశలు వేసి పెట్టారు.
ఇక వంట చేసేటప్పుడు వరుణ్ తో కలిసి చిరు చేసిన అల్లరి పని నవ్వులు పోయిస్తుంది. ఇద్దరు రెండు స్టవ్ లు వెలిగించి.. పెనంపై రెండు దోశలు పోశారు.. వరుణ్ దోశ బాగా రాగా .. చిరు దోశ సరిగ్గా రాలేదు. దీంతో వెంటనే చిరు, వరుణ్ దోశను చెడగొడుతూ వార్న్ దోశ బాగా వచ్చింది.. నాకు కుళ్లు వచ్చేసింది.. చెడగొట్టేయాలి అంటూ దోశను చిందరవందర చేసి ఉప్మా చేశాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీంతో వరుణ్ షాక్ అవ్వుతూ నవ్వడం మొదలుపెట్టాడు. ఈ వీడియోలో చిరు తల్లి అంజనా దేవి, నాగబాబు దంపతులు, మెగా ప్రిన్సెస్ నిహారిక, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కనిపించారు. ఈ వీడియోను వరుణ్ తేజ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ “బాస్ చిరంజీవితో దోస మేకింగ్ 101.. 2022 భోగి” .. అందరికి భోగీ శుభాకాంక్షలు అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!