మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే ఇంకోపక్క తమ్ముడు పవన్ జనసేన పార్టీలో కీలక బాధ్యతలు వహిస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీలో వివాదాలకు ఘాటుగా స్పందించే వ్యక్తి నాగబాబు మాత్రమే. ఇక తాజాగా ఆయన సోషల్ మీడియా లో ఒక పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది అంటూ పెట్టిన ఈ పోస్ట్ అనేక అనుమానాలకు దారితీస్తుంది.
” ఇన్నాళ్ల నా జీవితంలో.. ఎన్నో ఒడిదుడుకులను చూసి, ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒక రకంగా చూస్తే ఈ ఆపదలు మరియు కష్టాలే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి ఎంతగానో సహాయపడ్డాయి. నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా ప్రజలకు సహాయ పడాలని నిర్ణయించుకొని అదే గమ్యంగా నా లక్ష్యం వైపు పయనించాను. ఈ పయనంలో నాకు ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనా, కానీ.. నన్ను ప్రతిసారి వెన్నంటి నడిపించి నాకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలే.. అందుకే ఇప్పటి నుంచి నా పూర్తి సమయాన్ని నా గమ్యం దిశగా ప్రయాణం కొనసాగించడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తా.. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి నాగబాబు రాజకీయాలకు దూరమవుతున్నాడా..? సినిమాలకు దూరమవుతున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. జనసేనకు రిజైన్ చేస్తున్నారా..? .. అని కొందరు.. పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారుతున్నారా..? అని కామెంట్స్ పెడుతున్నారు.
