Mega Star: హైదరాబాద్ లో మొదలైన ‘మెగా154’ భారీ షెడ్యూల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ‘మెగా154’. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబధించిన కీలకమైన, భారీ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టీమ్ మొత్తం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే దర్శకుడు బాబీ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ చేదు ఘటన నుండి వెంటనే బయటకు వచ్చి, షెడ్యూల్స్ ఎక్కడా దెబ్బ తినకుండా బాబీ షూటింగ్ కు హాజరు కావడం విశేషం. మెగా154 ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో దర్శకుడు బాబీ కల నిజమైనట్లయింది. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ మునుపెన్నడూ చూడని మాస్ అప్పీలింగ్ , పవర్- ప్యాకెడ్ పాత్రలో మెగాస్టార్ ని చూపించబోతున్నారు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దీనిని నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా 154కోసం ప్రముఖ నటులు, అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం సమకూర్చుతుండగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా మెగా154 ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!