టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి స్కిన్ షో కి దూరంగా ఉన్న మీరా ఇప్పుడు సడెన్ గా స్కిన్ షో చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగింటి ఆడపడుచులా.. ముగ్ద మనోహరమైన రూపంతో ఉండే మీరా ఇప్పుడు గ్లామర్ ని ఒలకబోస్తుంది. పెళ్లి తరువాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అమ్మడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఇదుగో ఇలా అందాలను ఆరబోస్తూ కనిపించింది.
నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లను రెచ్చగొడుతుంది. మీరాను ఇలా చూస్తుంటే కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదని చెప్పొచ్చు.. పూల పూల లాంగ్ నెట్ డ్రెస్ లో ఇలా ఎద అందాలను ఆరబోసి.. హాట్ లుక్ తో చంపేసింది. అంటే ఇన్ డైరెక్ట్ గా తాను గ్లామర్ పాత్రలకు సై అంటున్నానని డైరెక్టర్స్ కి హింట్ ఇస్తుందన్నమాట. అయితే పలువురు నెటిజన్లు మాత్రం మీరా పై కస్సుమంటున్నారు. అవకాశాల కోసం ఇంతలా అందాలను ఆరబోయలా..? ముందు లాగే హోమ్లీగా ఉండొచ్చు కదా అని ఉపదేశం చేస్తున్నారు. మరి అమ్మడి స్కిన్ షో ఏ డైరెక్టర్ కళ్లలో పడుతుందో చూడాలి.
