Site icon NTV Telugu

Meenkashi: నా తల్లి జయలలిత.. నా తండ్రి శోభన్ బాబు.. వారి అసలు వారసురాలిని నేనే

jayalalitha

jayalalitha

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అస్సలు వారసురాలు ఎవరు అంది ఇప్పటికి మిస్టరీగానే మారింది. ఇప్పటివరకు ఆమె వారసురాలిని నేను అంటే నేను అని చాలామంది మీడియా ముందు రచ్చ చేశారు. ఇక తాజాగా మరో మహిళ తాను జయలలిత, శోభన్ బాబు ల వారసురాలిని అంటూ తహసీల్దార్ కార్యాలయంలో రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మధురై తిరుమళ్లువర్ నగర్ కు చెందిన 38ఏళ్ల మీనాక్షి కి మురుగేశన్ అనే వ్యక్తితో వివాహమైంది. ఇటీవల ఆమె తన తల్లి చనిపోయిందని.. తనకు వారసత్వ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసింది.

అందులో మీనాక్షి తల్లిదండ్రుల పేర్లు చూసి అధికారులు అవాక్కయ్యారు.తల్లి జయలలిత.. తండ్రి శోభన్ బాబు అని ఉండడంతో ఏంటి ఇది అని అధికారులు ప్రశ్నించారు. దానికి ఆమె జయలలిత అసలు వారసురాలిని నేనే.. నాకు వారసత్వ సర్టిఫికెట్ ఎందుకు ఎవ్వరు అంటూ వాగ్వాదానికి దిగింది. పళనిలో బంగారు రథం లాగే హక్కును తన తండ్రి శోభన్‌బాబు తనకు ఇచ్చారని, దానికి సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని, చిన్నప్పుడే తన తల్లి జయలలిత తనను వదిలేసిందని చెప్పుకొచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు వారసత్వ సర్టిఫికెట్ చెన్నై లో తీసుకోవాలని తెలిపారు. ఇక ఈ వార్త ప్రస్తుతం తమిళ్ నాడులో సెన్సేషన్ గా మారింది.

Exit mobile version