Site icon NTV Telugu

Meenakshi Dixit: మహేష్ పక్కన ఉన్న ఈ హాట్ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

Maharshi

Maharshi

Meenakshi Dixit: సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత జంటగా దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా దూకుడు నిలిచింది. మహేష్ కామెడీ టైమింగ్, డాన్సులు, యాక్షన్ అన్నింటికి మించి తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో నీ దూకుడు టైటిల్ సాంగ్ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఇక అందులో నటించి మెప్పించిన బ్యూటీనే మీనాక్షి దీక్షిత్. ఈ సాంగ్ తర్వాత తెలుగులో అమ్మడి పేరు బాగా వినిపించింది. లైఫ్ స్టైల్ అనే తెలుగు సినిమాతో మీనాక్షి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన ఫలితం అందకపోయేసరికి ఐటం ఐటెం సాంగ్స్ లో నటించింది. దూకుడు సినిమాతో మీనాక్షికి మంచి పేరు వచ్చింది. ఇక మహేష్ బాబు నటించిన మహర్షి లో కూడా ఆమె ఒక కీలకపాత్రను నటించింది. మహేష్ ఫ్రెండ్ గా మీనాక్షి కనిపించింది.

Thalapathy68: 23 ఏళ్ల తరువాత విజయ్ సరసన జ్యోతిక..

అయితే ఇన్ని రోజుల తరువాత అమ్మడి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే..ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అభిమానులు.. సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదిక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మీనాక్షి మహేష్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. బిలేటెడ్ గా హ్యాపీ బర్త్ డాట్ చెప్తూ మహర్షి రోజులను గుర్తుచేసుకుంది. మహర్షి లోని కొన్ని స్టిల్స్ ను పోస్ట్ చేస్తూ మహేష్ బాబుతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని, ఆ మెమొరీస్ ను పంచుకుంటున్నట్లు తెలిపింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మీనాక్షి హీరోయిన్ మెటీరియల్ అయినా అమ్మడికి మాత్రం తెలుగులో మంచి అవకాశాలు రాలేదనే చెప్పాలి. మరి ముందు ముందు ఈ చిన్నది టాలీవుడ్ లో కూడా ఏమైనా మంచి సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి.

Exit mobile version