NTV Telugu Site icon

Meenakshi Chaudhary: ఇక్కడ మహేష్.. అక్కడ విజయ్.. ఏం లక్ పాప నీది

Meenakshi

Meenakshi

Meenakshi Chaudhary: ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ మీనాక్షి చౌదరి. మొదటి సినిమా హిట్ కాకపోయినా అమ్మడిని మాత్రం టాలీవుడ్ గుర్తించింది. ఇక రెండవ సినిమానే మాస్ మహారాజ రవితేజ తో ఖిలాడీ సినిమాలో నటించింది. ఈ సినిమా అయితే డిజాస్టర్ నే అందుకుంది. ఇక ముచ్చటగా మూడో సినిమా హిట్ లో చేసి హిట్ అందుకుంది. అప్పటి నుంచి అమ్మడి దశ తిరిగిపోయింది. ఆ హిట్ తో మీనాక్షి.. మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ పట్టేసింది. గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో శ్రీలీల ను మెయిన్ హీరోయిన్ గా మార్చేసి.. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షిని తీసుకున్నారు. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే మాములు విషయం కాదన్న సంగతి తెల్సిందే. త్రివిక్రమ్ సినిమా అంటే.. రెండో హీరోయిన్ అయినా పర్లేదని వచ్చేస్తారు హీరోయిన్లు. మీనాక్షి కూడా అలాగే అనుకోని ఒప్పుకుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Annapoorani: బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి.. ఆ పని చేయడం తగునా నయన్.. ?

ఇక ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ మారిపోతుంది. ఇక్కడే బంపర్ ఆఫర్ పట్టేసింది అంటే.. కోలీవుడ్ లో కూడా ఈ చిన్నది లక్కీ ఛాన్స్ పట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. లియో తరువాత విజయ్ నటిస్తున్న చిత్రం తలపతి 68. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను AGS ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది. నేడు పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా నటిస్తుందని అధికారికంగా తెలిపారు. దీంతో అమ్మడు లక్ మాములుగా లేదని తెలుస్తోంది. తెలుగులో మహేష్.. తమిళ్ లో విజయ్ సరసం ఛాన్స్ పట్టేసిందంటే మాములు విషయం కాదు. ఈ రెండు హిట్ కొడితే .. రెండు ఇండస్ట్రీలో ఈ చిన్నది స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయమని అభిమానులు అంటున్నారు. మరి అమ్మడి జాతకం ఎలా ఉంటుందో చూడాలి.

Show comments