Meenakshi Chaudhary : నాకు ఏజ్‌తో ప్రాబ్లం లేదు.. ఎవరైనా ఓకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ఒక్కో స్టార్ హీరోయిన్ కెరీర్ అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది. కొన్నిసార్లు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయి. కానీ అవి ఆశించినంతగా హిట్ కాకపోతే, హీరోల కంటే హీరోయిన్‌నే బాధ్యురాలిగా తేలుస్తారు. అలాంటి అనుభవం పంచుకుంది అందాల భామ మీనాక్షి చౌదరి.
Also Read : Andhra King Taluka : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ టైటిల్ ప్రోమో రిలీజ్.. ఎనర్జీతో మెప్పించిన రామ్
Also Read
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి, అడివి శేష్‌తో కలిసి చేసిన హిట్ 2 సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ దూసుకుపోయింది. వరుసగా గుంటూరు కారంలో మహేష్ బాబుతో, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి వరుస సక్సెస్‌లు దక్కించుకుంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మీనాక్షి తన సినీ ప్రయాణం గురించి బహిరంగంగా మాట్లాడింది. “నటిగా ఎలాంటి పాత్ర వచ్చినా చేయాలి, అప్పుడు మాత్రమే మన నటనకు విలువ తెలుస్తుంది. కానీ ఇకపై పిల్లల తల్లిగా కనిపించే రోల్స్ మాత్రం చేయను. లక్కీ భాస్కర్లో ఆ పాత్ర కథ నచ్చి చేశాను, కానీ ఇకపై అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా ‘నో’ చెబుతా. పెద్ద హీరోలతో కలిసి సినిమాలు చేయడానికే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలా చేసే అవకాశం వస్తే దాన్ని కొత్త జానర్‌గా తీసుకుంటాను” అని స్పష్టంగా తెలిపింది.
అలాగే, “వెంకటేశ్ గారితో కలిసి చేసిన సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశా. చిరంజీవిగారితో చేస్తున్న విశ్వంభర సినిమా నా కెరీర్‌లో స్పెషల్ ఛాప్టర్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది” అంది మీనాక్షి. అలాగే రూమర్స్ గురించి మాట్లాడుతూ – “నా గురించి ఏదైనా చెప్పాలంటే నేను స్వయంగా చెబుతా. నాకూ సోషల్ మీడియా ఉంది కాబట్టి, ఇతరులు రూమర్స్ సృష్టించాల్సిన అవసరం లేదు” అని చెప్పింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!