JIGRIS : జిగ్రీస్ మూవీ నుంచి మీరేలే సాంగ్ రిలీజ్..
- యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మూవీ
- తాజా సాంగ్ రిలీజ్ చేసిన తరుణ్ భాస్కర్
- ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JIGRIS : యంగ్ హీరో రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ అథేర్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కృష్ణ వోడపల్లి ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ మూవీ టీజర్ ను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఫస్ట్ లిరికల్ సాంగ్ ను హీరో కిరణ్ అబ్బవరం రిలీజ్ చేశాడు. ఇప్పుడు మరో సాంగ్ ను డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రిలీజ్ చేశాడు. మీరేలే అంటూ సాగే ఈ పాట మంచి మెలోడీ థీమ్ తో వచ్చింది. ఫ్రెండ్స్ మధ్య సీన్లను గుర్తు చేస్తూ సాగుతుంది. లిరిక్స్, మ్యూజిక్, బీజీఎం ఆకట్టుకుంటున్నాయి.
Read Also : Rahul Ravindran : తాళి వేసుకోవడం వివక్ష లాంటిదే.. రాహుల్ రవీంద్రన్ కామెంట్స్
Also Read
నలుగురు కుర్రాళ్లు ఒక వింటేజ్ మారుతి కారులో గోవా వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వాళ్లు ఎదుర్కున్న సమస్యలు ఏంటి అనే కాన్సెప్టుతో ఫన్ అండ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. త్వరలోనే మూవీ ప్రమోషన్లలో జోరు పెంచబోతున్నారు. ఫ్రెండ్స్ మధ్య సాగే ఫన్నీ సీన్లతో వచ్చే సినిమాలు యూత్ ను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఇప్పుడు జిగ్రీస్ కూడా అలాంటి దారిలోనే రాబోతోంది. రామ్ నితిన్ ఈ మధ్య మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అందుకే ఈ మూవీపై మంచి అంచనాలు పెరుగుతున్నాయి.
Read Also : Allu Arjun : క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ కు బన్నీ బర్త్ డే విషెస్
తాజావార్తలు
-
Riyan Parag-Vaibhav: మేమేమైనా ఫిల్మ్ స్టార్స్ హా.. ఫోటోగ్రాఫర్లకు షాక్ ఇచ్చిన రియాన్ పరాగ్!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Maa Inti Bangaram:స్టేజ్‌పైనే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని..
-
Tamil Nadu Politics: సీఎం విజయ్ సైలెంట్ ఆపరేషన్..మేజిక్ ఫిగర్‌పై ‘టీవీకే’ కన్ను.. కాంగ్రెస్‌కు తప్పని టెన్షన్!
-
Devara : రిలీజ్ అయిన రెండేళ్లకు దేవర శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!