Little Hearts : మౌళి తనూజ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేసుకునే దగ్గరి నుంచి సినిమాలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేదాకా ఎదిగాడంటే మామూలు విషయం కాదు. సినిమా బాగుంటే చిన్న సినిమానా.. పెద్ద మూవీనా అని చూడకుండా ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకుంటారు. అది కామన్. కానీ ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. మౌళి తన సినిమాను ప్రమోట్ చేసుకున్న విధానం. సొంతంగా కంటెంట్ క్రియేటర్ అయిన మౌళికి సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. దాన్ని కరెక్ట్ గా వాడుకున్నాడు మౌళి. అంతకు ముందు కూడా సినిమాలకు ప్రమోట్ చేసిన అలవాటు ఉంది. అందుకే తన సినిమాకు సొంతంగా ప్రమోషన్ కంటెంట్ రాసుకుని మరీ ప్రమోట్ చేశాడు.
Read Also : Sandy Master: చిన్నప్పుడు చచ్చిన మేక కళ్ళని ఏడిపించారు.. ఇప్పుడవే సినిమా అవకాశాలు తెస్తున్నాయ్!
అతనితో పాటు జై కృష్ణ తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి కామెడీగా చేసిన కంటెంట్ ప్రమోషన్ మామూలుగా వైరల్ కాలేదు. లిటిల్ హార్ట్స్ సినిమాను కూడా కామెడీ రీల్స్ తో ప్రమోట్ చేయడం వల్లే ఎక్కువ మందికి సినిమా రీచ్ అయింది. పెద్ద స్టార్లు వచ్చి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేకుండా.. తన సొంత ట్యాలెంట్ తోనే మౌళి ఈ మూవీని ప్రమోట్ చేసిన విధానం బాగుంది. ఒక సినిమాలో తాను హీరో అనే విషయాన్ని కూడా మర్చిపోయి.. సాదా సీదాగానే తన సినిమాను ప్రమోట్ చేశాడు. అది అందరికీ సాధ్యం కాదు. హీరోలు అంటే కోట్ల కొద్దీ రెమ్యునరేషన్ తీసుకొని ప్రమోషన్ల కోసం స్టైల్ గా నాలుగు ఇంటర్వ్యూలు ఇవ్వడం కామన్. అది కాదు కావాల్సింది జనాలకు. కొత్తగా ప్రమోట్ చేసి జనాలకు సినిమా గురించి తెలియజేయడం. అదే మౌళి చేశాడు. మూవీ రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన తర్వాత కూడా కామన్ గానే థియేటర్ల చుట్టూ తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేశాడు. స్టేజి మీదకు ఎక్కినా తాను హీరోలా కాకుండా కామన్ యువకుడిగా ప్రవర్తించి అందరి దృష్టిలో సినిమా గురించి చర్చ జరిగేలా చేశాడు. ఇలా ప్రమోట్ చేయడం వల్లే మూవీకి ఎక్కువ రీచ్ వచ్చింది. ఈ విషయంలో అతన్ని చూసి అందరూ నేర్చుకోవాల్సిందే.
Read Also : Bollywood : ఆషీకీ 2 డైరెక్టర్ తో గొడవ.. ఛావా దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
