Navadeep: మాస్ మహారాజా లాంచ్ చేసిన నవదీప్ ‘లవ్ మౌళి’ ఆడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తర్వాత ‘లవ్, మౌళి’గా సరికొత్తగా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు ‘ద యాంథమ్ ఆఫ్ లవ్ మౌళి’ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ ప్రమోషనల్ కంటెంట్‌లో నవదీప్ డిఫరెంట్‌గా కనిపించడంతో ఈ సినిమా నవదీప్ 2.Oగా అభిమానులు వర్ణిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఆడియో జూక్ బాక్స్ ని మాస్ మహారాజా రవితేజ విడుదల చేసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు.
హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ చిత్ర పాటలను వినూత్నంగా విడుదల చేశారు. ఈ సినిమాలోని పాటలను ఎవరైతే పాడారో.. వారితోనే ఆ పాటను ఈ ఈవెంట్‌లో పాడించి.. అదే పాటను వారిచేతే విడుదల చేయించారు. అనంతరం పాటలన్నీ కలిపి ఉన్న జూక్‌బాక్స్‌ని స్టార్ హీరో రవితేజ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. రవితేజ నటించిన ‘ఈగల్’ చిత్రంలో నవదీప్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ‘ఈగల్’ ట్రైలర్ చూస్తుంటే.. నవదీప్ పాత్రకు ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉందనేది అర్థమవుతోంది. ‘లవ్ ,మౌళి’ సినిమాలోని పాటలను ఇలా వినూత్నంగా విడుదల చేయడం.. అలాగే మాస్ రాజా రవితేజగారు జూక్ బాక్స్ విడుదల చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని హీరో నవదీప్ అన్నారు. నా ఆలోచన విధానానికి, నేను చేయాలనుకుంటున్న సినిమాలకు ‘లవ్ ,మౌళి’ దగ్గరగా అనిపించింది. అందుకే మీ ముందుకు సరికొత్త చిత్రంతో రాబోతున్నానని నవదీప్ తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..