Site icon NTV Telugu

Maruva Tarama : మరువ తరమా ట్రైలర్‌ ఎమోషన్స్ తో కట్టిపడేసింది : అజయ్ భూపతి

Maruva

Maruva

Maruva Tarama : రొమాంటిక్ మ్యూజికల్ లవ్ డ్రామా మరువ తరమా ట్రైలర్ ప్రస్తుతం ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. భావోద్వేగాలను పలికించే సీన్లు హైలెట్ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఈ ట్రైలర్‌ను చూసి టీమ్‌కి విసెష్ తెలిపారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మూవీ ఎమోషన్స్ తో కట్టిపడేసిందన్నాడు. ఇలాంటి సినిమాలు అన్ని వర్గా లప్రేక్షకులకు నచ్చుతాయని వివరించాడు అజయ్ భూపతి. అజయ్ భూపతి కామెంట్స్ తో మూవీకి మరింత హైప్ క్రియేట్ అయింది. సినిమా నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Read Also : iBomma Ravi : 15 రోజులకో టూర్.. లగ్జరీ లైఫ్‌.. రవి లైఫ్ స్టైల్ ఇదే

మరువ తరమా మూవీ ఒక కవితాత్మక ప్రేమకథగా తెలుస్తోంది. హరీష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వాల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీమ్ చెబుతోంది. వారి నటనలో కనిపించే హావభావాలు, డైలాగులు ఆసక్తికరంగా సాగుతాయని అంటున్నారు. మూవీని చైతన్య వర్మ డైరెక్ట్ చేశారు. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి. విజయ్‌కుమార్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్, అరిష్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. కిలారి సుబ్బారావు పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు.
Read Also : Jabardasth Naresh : చెత్త అమ్ముకుంటూ బతికా.. జబర్దస్త్ నరేశ్ ఎమోషనల్

Exit mobile version