Site icon NTV Telugu

ప్రభాస్- మారుతి హర్రర్ స్టోరీ.. అలా చేస్తే చంపేస్తామంటున్న ఫ్యాన్స్

prabhas

prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోరు పెంచేస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే 8 సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమవుతుండగా.. పాన్ ఇండియా మూవీలు ‘సలార్, ‘ఆది పురుష్’, ప్రాజెక్ట్‌ కె’, ‘స్పిరిట్‌’ వంటి పెద్ద ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజగా వీటితో పాటు మూడు సినిమాలను ప్రభాస్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం బట్టి ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడట. ‘రాజా డీలక్స్’ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు సమాచారం.

ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నదంట. అయితే ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారుతి సినిమా అంటే హీరోకి డిఫెక్ట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కూడా డార్లింగ్ కి ఏదొక డిఫెక్ట్ మారుతి పెడతాడేమో అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ అన్న కి ఏమైనా డిఫెక్ట్ పెడితే చంపేస్తాం అని ఫ్యాన్స్ మారుతికి వార్నింగ్ ఇస్తున్నారు. ఇక తాజగా ఈ వార్తలపై మారుతీ క్లారిటీ ఇచ్చాడు. ” నా కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి వార్తలు వస్తున్నాయి. టైటిల్, హీరో, సంగీత దర్శకుడు గురించి వస్తున్నా వార్తలు విన్నాను. కానీ, కాలం అన్నింటికి సమాధానం చెప్తోంది. మీ సపోర్ట్ కి ప్రేమకి ధన్యవాదాలు.. జాగ్రత్తగా ఉండండి.” అందులోను ఈ సినిమా హర్రర్ కథాంశంతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే

Exit mobile version