Site icon NTV Telugu

Marko Producer : మార్కో నిర్మాత సెకండ్ మూవీ.. ఇంకా అరాచకం

Marko

Marko

Marko Producer : మార్కో సినిమాతో భారీ హిట్ అందుకున్న నిర్మాణ సంస్థ క్యూబ్స్. ఈ ప్రొడక్షన్ సంస్థ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. ఆంటోనీ వర్గీస్ హీరోగా వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాహుబలితో ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు మెరిసింది. ఈవెంట్ కు యాంటోని వర్గీస్, కబీర్ దూహన్ సింగ్, రాజిషా విజయన్, హనన్ షా, జగదీష్, సిద్దిక్, పార్త్ తివారీ లాంటి స్టార్‌లు హాజరు కావడం మరింత జోష్‌ నింపింది. ఈ సినిమాను దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. పాల్ జార్జ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.

Read Also : Agent : మూవీ ప్లాప్.. రూపాయి తీసుకోని హీరో.. ఎవరంటే..?

కాంతార, మహారాజా మూవీలతో ఆకట్టుకున్న కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్‌గా రాజిషా విజయన్ నటిస్తోంది. టాలీవుడ్ నటుడు సునీల్, కబీర్ దూహన్ సింగ్, వ్లాగర్-సింగర్ హనన్ షా, ర్యాపర్ బేబీ జీన్, తెలుగు నటుడు రాజ్ తిరందాసు, అలాగే సీనియర్ నటులు జగదీష్, సిద్దిక్ లు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో తీసుకొస్తున్నారు. బాహుబలి, జవాన్ సినిమాలకు పనిచేసిన ఫైట్ మాస్టర్ కేచా ఖాంఫక్డీ ఈ మూవీకి స్టంట్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా భారీ తారాగణంతో రంగంలోకి దిగుతున్న సినిమాపై అప్పుడే అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ మార్కోను మించి యాక్షన్ ను పంచుతుందని టీమ్ చెబుతోంది.

Read Also : Sandeep Vanga : సందీప్ వంగాతో నాగ్ అశ్విన్ కు చిక్కులు.. ప్రభాస్ ఇప్పుడెలా..?

Exit mobile version