NTV Telugu Site icon

Marana Mass : హీరోగా డైరెక్టర్.. నిర్మాతగా యంగ్ హీరో

Basil Josef

Basil Josef

రీసెంట్ టైమ్స్‌లో సినిమాను డిఫరెంట్ గా ప్రమోట్ చేసి ఆడియన్స్ చూపు తనవైపు తిప్పుకునేలా చేస్తున్నారు మేకర్స్. సంక్రాంతికి వస్తున్నాం కోసం అనిల్ రావిపూడి వీర లెవల్లో ప్రమోషన్లు చేసి కొత్త ఒరవడి సృష్టించాడు. ఇదే దిల్రూబా, రాబిన్ హుడ్ ఫాలో అయ్యాయి. ఇప్పుడు ఈ మ్యాడ్ నెస్ పొరుగు ఇండస్ట్రీకి పాకింది. మాలీవుడ్ యంగ్ హీరో బాసిల్ జోసెఫ్ కూడా తన అప్ కమింగ్ మూవీ ‘మరణ మాస్’ విషయంలో ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని అప్లై చేస్తున్నట్లే ఉంది.

Also Read : Robinhood : నటుడిగా డేవిడ్ వార్నర్.. ఫస్ట్ లుక్ రిలీజ్.. ఇక బ్యాటింగే

జయ జయ జయహే, గురువాయుర్ అంబనడయిల్, నునక్కుజి, ఏఆర్‌ఎం, సూక్ష్మదర్శిణీతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన బాసిల్ జోసెఫ్. ఈ ఏడాది పర్వీన్ కూడు షప్పు, పొన్మన్ చిత్రాలతో ప్లాప్స్ చూశాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో నుండి రాబోతున్న సినిమా మరణమాస్. కాగా, ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే ప్రమోషన్లు స్టార్ట్ చేసింది యూనిట్. మరణమాస్ నుండి సివిల్ సెన్స్ అనే వీడియోను విడుదల చేశారు మేకర్స్. డిఫరెంట్‌గా సినిమాను ప్రమోట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ అంటూ సాగిపోయే ఫన్నీ వీడియోను వదిలారు. హీరో కూడా డిఫరెంట్ లుక్కులో కనిపిస్తున్నాడు. డార్క్ హ్యూమర్ గా సినిమాను తెరక్కిస్తున్నాడు దర్శకుడు శివ ప్రసాద్. గతంలో బాసిల్ డైరెక్షన్ లో వచ్చిన మిన్నల్ మురళి మూవీ కోసం తన దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసిన శివకు ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఛాన్సిచ్చాడు. ఈ ప్రాజెక్టును మరొక యంగ్ హీరో టోవినో థామస్ బ్రదర్స్ నిర్మిస్తున్నారు. విషు సందర్భంగా మూవీని రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్.