ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నిన్న “డ్రింకర్ సాయి” సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
Sandhya Theatre Stampede: ఆరోజు ధియేటర్ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నారు!
ఇక ఈరోజు డ్రింకర్ సాయి మూవీ డైరెక్టర్ పై మంతెన సత్యనారాయణ ఫాన్స్ దాడి చేసినట్టు తెలుస్తోంది. సినిమాలో ఆయన్ను కించపరుస్తూ సీన్లు తీశారని విచక్షణ రహితంగా దాడి చేసినట్టు సమాచారం. సక్సెస్ టూర్ లో భాగంగా గుంటూరు శివ థియేటర్ లో ఘటన జరిగినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ మంతెన సత్యనారాయణ ఫాలోవర్ అని తెలుస్తోంది. అయితే ఇది నిజమైన దాడేనా లేక ప్రమోషన్స్ లో భాగంగా సినిమా యూనిట్ చేయించిందా అనే అనుమానాలు లేకపోలేదు.