Site icon NTV Telugu

Manchu Manoj : మనోజ్ ట్వీట్.. మంచు ఫ్యామిలీలో వివాదాలు ముగిసినట్టేనా..?

Manchu Manoj Vs Manchu Vishnu

Manchu Manoj Vs Manchu Vishnu

Manchu Manoj : మంచు ఫ్యామిలీలో వివాదాలకు ముగింపు పలికినట్టేనా.. ఈ మధ్య ఎలాంటి గొడవలు పెద్దగా బయటకు కనిపించట్లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే భైరవం, కన్నప్ప సినిమాల నుంచే అంతా సైలెంట్ అయిపోయారు. అంతకు ముందు మనోజ్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి నానా రచ్చ చేశారు. మోహన్ బాబు, విష్ణు కూడా వరుస స్టేట్ మెంట్లు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటివేమీ కనిపించట్లేదు. కన్నప్ప సినిమాను చూసి మరీ మనోజ్ విష్ణు నటనను మెచ్చుకున్నాడు. ఆ తర్వాత నుంచే సైలెంట్ గా ఉంటున్న మనోజ్ తాజాగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. కన్నప్ప సినిమాలో విష్ణు కొడుకు అవ్రామ్ నటించాడు. తాజాగా నిర్వహించిన సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ లో అవ్రామ్ కు అవార్డు దక్కింది. ఇందుకు సంబంధించిన వీడియోను విష్ణు ట్వీట్ చేశాడు.

Read Also : Bigg Boss : బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’లో 45 మంది పోటీ.. ప్రోమో రిలీజ్

ఆ ట్వీట్ ను మనోజ్ రీ ట్వీట్ చేస్తూ.. కంగ్రాట్స్ అవ్రామ్. నువ్వు ఇలాగే ఎదగాలి నాన్నా.. ఈ అవార్డును అన్న విష్ణు, నాన్న మోహన్ బాబు గారితో నువ్వు అందుకోవడం ప్రత్యేకం. లాట్స్ ఆఫ్ లవ్ అంటూ పోస్టు చేశాడు. విష్ణు ట్వీట్ ను రీ ట్వీట్ చేయడం అంటే కుటుంబంలో గొడవలు ముగిసినట్టే అని కనిపిస్తోంది. పైగా విష్ణు గురించి మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా ఉంటున్నాడు మనోజ్. అటు మనోజ్, విష్ణు కూడా సైలెంట్ గా ఉండటం చూస్తుంటే.. వీరంతా గొడవలకు ముగింపు పలికినట్టే అనే ప్రచారం జరుగుతోంది.

Read Also : Nidhi Agarwal : భయపెడుతా అంటున్న నిధి అగర్వాల్..

Exit mobile version