Site icon NTV Telugu

Manjummel Boys : సూపర్ హిట్ డైరెక్టర్’పై లైంగిక వేధింపుల కేసు

Chidambaram

Chidambaram

సూపర్ హిట్ మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు చిదంబరంపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ యువతి ఫిర్యాదు మేరకు ఎర్నాకుళం సౌత్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. చిదంబరం సూపర్ హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడన్న సంగతి తెలిసిందే. అతనిపై 2022లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంకుళంలోని ఒక ఫ్లాట్‌లోకి బలవంతంగా తీసుకెళ్లి తప్పుడు ఉద్దేశ్యంతో అసభ్యంగా ప్రవర్తించారని ఆ మహిళ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. BNS సెక్షన్ 74 మరియు 75 కింద కేసు నమోదు చేశారు. మహిళ ఫిర్యాదుపై వివరణాత్మక దర్యాప్తు కొనసాగుతోందని ఎర్నాకుళం సౌత్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో చిదంబరాన్ని విచారిస్తామని, అవసరమైతే అరెస్టుతో సహా చర్యలు తీసుకుంటామని పోలీసులు సూచించారు. మహిళ గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించడం, లైంగికంగా వేధించే విధంగా మాట్లాడటం లేదా వ్యవహరించడం వంటి అభియోగాలు ఈ కేసులో ఉన్నాయి.

Also Read:Virosh : విజయ్ ‘ఐస్‌క్రీమ్స్’ వెనుక రష్మిక.. ప్రేమకు బీజం ఇలా పడిందా?

ఇక రెండు రోజుల క్రితం నటుడు దిలీప్ తో సినిమా చేస్తున్నట్టు వస్తున్న వార్తలను దర్శకుడు చిదంబరం ఖండించారు. చెత్త వార్తలను పంచుకునే ముందు అది నిజమో కాదో నిర్ధారించుకోవాలని, తాను సర్వైవల్ స్పెషలిస్ట్ కాదని దర్శకుడు అన్నారు. దిలీప్, మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం కలిసి ఒక సినిమా చేస్తున్నారని, ఇది సర్వైవల్ థ్రిల్లర్ అని వార్తలు వచ్చాయి. ఈ వార్తను చిదంబరం షేర్ చేస్తూ అందులో నిజం లేదని అన్నారు.

Exit mobile version