కోలీవుడ్ స్టార్ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి తమిళ్ సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఈ జంట పెళ్లి పీటలెక్కుతుందని వార్తలు వైరల్ గా మారాయి. ఇక వైరల్ వార్తలపై మంజిమా స్పందించింది. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
” గౌతమ్ ప్రేమను నేను అంగీకరించలేదు.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్ని అసత్యం. మా ఇద్దరి పెళ్ళికి సంబధించిన వార్తలను విని నేను చాలా బాధపడ్డాను. నా వరకు ఓకే.. ఈ వార్తలు విని నా తల్లితండ్రులు ఎలా స్పందిస్తారో అని ఎంతో భయపడ్డాను. దేవుడి దయవలన ఈ వార్తలను వారు సీరియస్ గా తీసుకోలేదు. దయచేసి తప్పుడు వార్తలను రాయకండి.. నా జీవితంలో జరిగే ఏ విషయమైనా నేనే చెప్తాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
