Site icon NTV Telugu

Maniratnam : బాహుబలిపై మణిరత్నం షాకింగ్ కామెంట్స్

Maniratnam

Maniratnam

Maniratnam : రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఎంతటి చరిత్ర సృష్టించిందో మనం చూశాం. ఆ సినిమా వల్లే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి కూడా దీని వల్లే పెరిగింది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అలాంటి బాహుబలి సినిమాపై తాజాగా సీనియర్ డైరెక్టర్ మణిరత్నం షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. బాహుబలి సినిమా లేకపోతే తాను ఎమోషన్స్ బలంగా ఉండే కథలు చేయలేనని తెలిపాడు. మరీ ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ మూవీని తాను అస్సలు డైరెక్ట్ చేసేవాడిని కాదన్నాడు. రాజమౌళి బాహుబలిని రెండు పార్టులుగా తీసి పాన్ ఇండియా మార్కెట్లో సక్సెస్ అయ్యాడు. ఆయన స్ఫూర్తితోనే నేను పొన్నియన్ సెల్వన్ ను రెండు పార్టులుగా చేశా అన్నాడు మణిరత్నం.

Read Also : Paresh Rawal : ఆస్కార్ అవార్డుల్లో లాబీయింగ్ ఉంది.. స్టార్ యాక్టర్ కామెంట్స్

గతంలో అలాంటి సాహసం ఎవరూ చేయలేదని.. భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నప్పుడు రెండు పార్టుల్లో కథ చెప్పడం అంటే పెద్ద సాహసమే అన్నాడు మణిరత్నం. రాజమౌళి బాహుబలి చేసిన తర్వాత తన లాంటి వారికి నమ్మకం పెరిగిందని.. అందుకే అలాంటి సినిమాలు ఇప్పుడు వస్తున్నాయన్నాడు. మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ రెండు పార్టులుగా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి పార్టు హిట్ టాక్ తెచ్చుకున్నా.. రెండో పార్టు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాలు డైరెక్ట్ చేసిన వ్యక్తిగా మణిరత్నంకు మంచి గుర్తింపు ఉంది.

Read Also : YS Jagan: చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

Exit mobile version