Mangalavaram : హీరోయిన్ కంటే అందరి చూపు జమీందార్ భార్య మీదనే.. ఎవరామె..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mangalavaram: ఈ మధ్యకాలం వచ్చే సినిమాల్లో పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే నటులు ఎక్కువ అయిపోయారు. జస్ట్ అలా కనిపించి ఇలా వెళ్లిపోయే పాత్రలను ఎవరు సెలెక్ట్ చేసుకోవడం లేదు. ఛాలెంజింగ్ గా ఉండాలి. నెగెటివ్ షేడ్స్ ఉన్నా కూడా పర్లేదు అని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఎక్కువ అలంటి పాత్రలు అయితేనే ముందుకు వస్తున్నారు. కొన్ని సినిమాల్లో అయితే హీరోయిన్ కంటే.. కీలక పాత్రల్లో నటించినవారే బాగా క్లిక్ అవుతున్నారు. అనిమల్ లో త్రిప్తి, సలార్ లో శ్రీయా రెడ్డి.. ఇక ఇప్పుడు మంగళవారంలో దివ్య పిళ్ళై. ఆర్ఎక్స్ 100 తరువాత అజయ్ భూపతి మంగళవారం సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మధ్యనే ఓటిటీలో కూడా రిలీజ్ అయ్యి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో పాయల్ కన్నా ఎక్కువ జమీందార్ భార్యగా నటించిన దివ్యకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆమె కూడా కుర్రాళ్ల క్రష్ గా మారిపోయింది. సినిమా మొదటి నుంచి కూడా ఎంతో మంచిదానిలా.. ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న ఆమె.. చివరిలో జమీందార్ కళ్లు కప్పి.. ఫోటోగ్రాఫర్ తో అక్రమసంబంధం పెట్టుకున్న మహిళగా, అది చూసిందని పాయల్ ను చంపే హంతకురాలిగా దర్శనమిచ్చింది. అసలు ఆ ట్విస్ట్ ను ప్రేక్షకులు అస్సలు ఉహించి ఉండరు. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా ఇపోయారు. మునుపెప్పుడు ఈమెను చూడలేదు.. ఎవరీమె అని సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారు.
దివ్య పిళ్ళై.. కేరళకు చెందిన ఎయిర్ హోస్టెస్. ఒక డైరెక్టర్ ఈమెను ఒక పెళ్ళిలో చూసి 2015 మలయాళంలో పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్ హీరోగా నటించిన అయల్ నంజళ్ల చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఆ తరువాత పృథ్వీరాజ్ నటించిన ఊజం చిత్రంలో నటించింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ రెండు సినిమాల పుణ్యమా అని అమ్మడు స్టార్ హీరోయిన్ అంత కాకపోయినా ఖాళీగా లేనంతగా వరుస అవకాశాలను అందుకుంది. తగ్గదేలే, ది విలేజ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక మంగళవారం సినిమాతో టాలీవుడ్ లో అమ్మడికి బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసి ఇలాంటి భార్య కావాలనుకున్నా.. క్లైమాక్స్ చూసి అసలు పెళ్లే వద్దు అనుకున్నాను అని కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే దివ్య తెలుగులో కూడా వరుస అవకాశాలను అందుకుంటుందని నమ్మకంగా చెప్పుకోవచ్చు. మరి ముందు ముందు దివ్య ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.
Also Read
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
- Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
- Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
తాజావార్తలు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?