మంచు ఫ్యామిలీకి ట్రోలింగ్ కొత్తేమి కాదు.. కొన్నిసార్లు ట్రోల్స్ ను లైట్ గా తీసుకున్నా ఇంకొన్ని సార్లు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇక మొన్నటికి మొన్న మా ఎలక్షన్స్ సమయంలో మంచు ఫ్యామిలీ మీద వచ్చిన ట్రోలింగ్స్ ఇప్పటివరకు మరెవ్వరి మీద రాలేదు అంటే అతిశయోక్తి కాదు. మా ప్రెసిడెంట్ అయ్యాక అయినా వదులుతారు అనుకుంటే అప్పుడు కూడా మంచు విష్ణు చేసిన ఒక పనితో ఆడేసుకున్నారు.ఏపీ టికెట్ రేట్ల విషయంలో జగన్ ను ఇండస్ట్రీ పెద్దలు కలవడానికే అవకాశం లేదు అని తేల్చి చెప్పేసిన తరుణంలో ఏపీ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలవడం అది `మా` అధ్యక్ష హోదాలో కలవలేదంటూనే అధికారిక మీటింగ్ అని చెప్పి విష్ణు నెటిజన్స్ చేతికి చిక్కాడు. అది కాస్తా సీరియస్ అయ్యి మోహన్ బాబు పోలీస్ కేసు వరకు వెళ్లడంతో కొద్దిగా నెమ్మదించారు ట్రోలర్స్.
ఇక తాజాగా మరోసారి విష్ణును ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈసారి సినిమా పరంగా మా ప్రెసిడెంట్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ప్రస్తుతం విష్ణు, ఇషాన్ దర్శకత్వంలో గాలి నాగేశ్వరరావు నఏ సినిమా చేస్తున్న విషయం విదితమే. హాట్ బ్యూటీలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అప్ డేట్ లు అందిస్తూ నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నాడు మంచు విష్ణు. తాజాగా ఒక సాంగ్ కోసం డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నాని, నా బాడీ మొత్తం హార్ట్ అయ్యినట్లు ట్వీట్ చేశాడు.. ఇక ఈ ట్వీట్ పై ట్రోలర్స్ తమదైన శైలిలో ఆడేసుకుంటున్నారు. “డాన్సా? ఫైట్ సీన్ అయ్యుంటదిలే” అంటూ మీమ్స్ తో సెటైర్లు వేస్తున్నారు. ఈ సెటైర్లు గమనించిన మంచు విష్ణు “నా కొరియోగ్రాఫర్ కూడా నా డాన్స్ మూవ్ మెంట్స్ ఫైట్ సీక్వెన్స్ లా వుంటాయని అంటున్నాడు” అని రిప్లై ఇచ్చాడు. మరికొందరు అన్న సన్నీ లియోన్ తోనే సాంగ్ అయ్యి ఉంటుంది.. అందుకే కొంచెం గట్టిగా కష్టపడినట్లున్నావ్ అని కామెంట్స్ పెడుతున్నారు.
Dance rehearsals started. Every part of my body hurts. 😳
— Vishnu Manchu (@iVishnuManchu) April 28, 2022
Well, that’s what the choreographer is saying, my dance moments are like fighting sequence. 😳 https://t.co/jHG5o13BsO
— Vishnu Manchu (@iVishnuManchu) April 29, 2022