Site icon NTV Telugu

Kannappa : కన్నప్పలో రజినీకాంత్ ను తీసుకుందామనుకున్నా.. విష్ణు కామెంట్స్ వైరల్

Rajinikanth

Rajinikanth

Kannappa : కన్నప్ప సినిమాలో స్టార్ల లిస్టు బాగానే ఉంది. దీనిపై మంచు విష్ణు చాలా సార్లు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఎవరిని ఎందుకు తీసుకున్నారనేది చాలా సార్లు వివరించాడు. అయితే తాజాగా మరో విషయాన్ని చెప్పాడు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప జూన్ 27న రిలీజ్ అవుతోంది. వరుస ప్రమోషన్లతో జోష్‌ పెంచేస్తున్నారు. అతి త్వరలోనే ట్రైలర్ లాంట్ ఈవెంట్ జరగబోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ఈ సినిమాలో రజినీకాంత్ ను తీసుకోవాలని అనుకున్నట్టు చెప్పాడు.

Read Also : Arrest Kohli: వెంటనే.. విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయండి!

‘నాన్న గారి పాత్రకు కాంబినేషన్ లో ఓ పాత్ర కోసం రజినీకాంత్ గారిని తీసుకోవాలని అనుకున్నా. కానీ కథతో సంబంధం లేకుండా స్టార్ల లిస్టు పెరుగుతుందని రచయితలు చెప్పడంతో ఆగిపోయా. లేదంటే ఆయన్ను కచ్చితంగా తీసుకునేవాళ్లం. మేం ప్రభాస్ ను ఎందుకు తీసుకున్నాం అనేది సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది.

రెండు పాత్రల్లో ఏదో ఒకటి ఎంచుకోమంటే ప్రభాస్ రుద్ర పాత్రను ఎంచుకున్నాడు. ఆ పాత్రకు అద్భుతంగా సరిపోయాడు. అతన్ని నేను శివుడి పాత్ర కోసం అనుకోలేదు. పాత్రకు తగ్గట్టు ప్రభాస్ ఒదిగిపోయాడు’ అంటూ తెలిపాడు మంచు విష్ణు. అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Sakshi Gupta: ‘లక్కీ భాస్కర్’ మాదిరిగా ప్లాన్.. రూ.4 కోట్లు కొట్టేసి చివరకు..!

Exit mobile version