Manchu Vishnu : మంచు విష్ణు కన్నప్ప మూవీ టీమ్ పై జీఎస్టీ సోదాలు నిర్వహించారు అధికారులు. మాదాపూర్ లోని విష్ణు ఆఫీసులో, మూవీకి చెందిన పలువురి ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించారు. మూవీ బడ్జెట్ విషయంలో జీఎస్టీ, ట్యాక్స్ ఎగ్గొట్టనట్టు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సోదాలపై మీడియా రిపోర్టర్లు ప్రశ్నించగా తాజాగా మంచు విష్ణు స్పందించారు.
Read Also : Thaman : అడ్రస్ పెట్టురా వచ్చి నేర్చుకుంటా.. థమన్ ఫైర్..!
‘సోదాలు చేస్తున్నట్టు మీరు చెప్పేదాకా నాకు తెలియదు. ఎల్లుండి కన్నప్ప రిలీజ్ ఉంది. ఆ బిజీలోనే ఉన్నాను. చేయనివ్వండి. దాచుకునేది ఏమీ లేదు. ఎక్కడెక్కడ అప్పులు చేశానో వాళ్లకు కూడా తెలుస్తుంది’ అంటూ నవ్వేశాడు. ఇక మూవీ అద్భుతంగా వచ్చిందని ఔట్ పుట్ చూసిన వాళ్లు చెబుతున్నట్టు విష్ణు కామెంట్ చేశాడు. సినిమా అందరికీ నచ్చుతుందని.. చివరి గంట సేపు అందరికీ గూస్ బంప్స్ వస్తున్నట్టు చూసిన వాళ్లే చెబుతున్నారని వివరించాడు మంచు విష్ణు.
Read Also : Kannappa : కన్నప్ప టీమ్ పై జీఎస్టీ సోదాలు.. మంచు విష్ణు సహా..