మంచు విష్ణు హీరో కాదా.. అసలు విష్ణుని ఎలా పిలవాలి.. విష్ణు అని పిలవాలా.. లేక హీరో అని పిలవాలా.. అయితే ఈ రెండిటిలో ఎలా పిలిచినా పలికేలా లేడు విష్ణు. మరి ఎలా పిలవాలి అంటే.. జిన్నాగా పిలవాలని చెబుతున్నాడు విష్ణు. ఓ సారి వివరాల్లోకి వెళితే.. చివరగా మోసగాళ్లు మూవీతో మెప్పించలేకపోయిన మంచు విష్ణు.. కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత జిన్నా అనే మూవీతో రాబోతున్నాడు. అసలు ఈ టైటిలే పాకిస్థాన్ సినిమాను తలపించేలా ఉండడంతో.. అనౌన్స్మెంట్ నుంచి అందరి దృష్టిని ఆకర్షించాడు విష్ణు. సూర్య దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోన్ హీరోయిన్లుగా జిన్నా అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్‌ను గాలి నాగేశ్వరరావు పాత్రను షార్ట్ కట్ చేసి జిన్నా అంటూ.. ఇటీవలె కాస్త వెరైటిగా ప్రకటించాడు విష్ణు. అలాగే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే హీరోయిన్లతో కలిసి కొత్తగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు విష్ణు.
ఇక ఇప్పుడు ఫస్ట్ లుక్ కూడా అదే విధంగా.. ఒక మేకింగ్ వీడియోతో విడుదల చేశాడు. డైరెక్టర్ సూర్య, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు మరియు ఫైట్ మాస్టర్ రామకృష్ణన్ షాట్ రెడీ చేసి విష్ణుని పిలుస్తారు. దాంతో అసిస్టెంట్ డైరెక్టర్ విష్ణు గారు షాట్ రెడీ.. హీరో గారూ షాట్ రెడీ.. అని విష్ణుని ఎంత పిలిచినా పట్టించుకోడు. కానీ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ అసలు విషయం చెప్పడంతో.. ‘జిన్నా షాట్ రెడీ’ అనగానే విష్ణు రంగంలోకి దిగడం.. ఆ వీడియోలో చూడొచ్చు. ఇక జిన్నా లుక్‌లో విష్ణు వైట్ అండ్ వైట్ డ్రస్‌లో.. కళ్ళజోడు పెట్టుకొని రఫ్‌గా ఉన్నాడు. ఈ సందర్భంగా.. మాస్, కామెడీ, యాక్షన్.. ఇది జిన్నా భాయ్ స్టైల్ అని విష్ణు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇక AVA ఎంటర్‌టైన్‌మెంట్ & 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని.. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీలోను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి జిన్నాగా విష్ణు సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.