Manchu Manoj: మంచు వారసుడు మంచు మనోజ్ ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. గత కొన్నేళ్లుగా భూమా మౌనికతో ప్రేమలో ఉన్న మనోజ్ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కాడు. కొద్దిసేపటి క్రితమే ఈ జంట మూడుముళ్లతో ఒక్కటి అయ్యారు. మంచు లక్ష్మీ ఇంట్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అతి తక్కువ ప్రముఖులే పెళ్లికి హాజరయ్యేనట్లు తెలుస్తోంది. కొత్త జంట మొదటి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. వధూవరులిద్దరూ బంగారు రంగు దుస్తుల్లో మురిసిపోయారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన ఆనందం మంచు మనోజ్ కళ్ళలో కనిపిస్తోంది.
ఇకపోతే కొన్నేళ్ల క్రితం మనోజ్ తన మొదటి భార్య ప్రణతి తో విడిపోయిన సంగతి తెల్సిందే. ఆ తరువాత మనోజ్ కు మౌనికతో పరిచయం ఏర్పడింది. కొన్నేళ్లు వీళ్లిద్దరు సహజీవనం కూడా చేసారని టాక్. ఇక వీరి పెళ్ళికి మంచు కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఇప్పటివరకు ఆగారు. చివరికి మనోజ్ కుటుంబాన్ని ఒప్పించి ఈ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ వివాహానికి మంచు మోహన్ బాబు అవ్వడం విశేషం. మొదటి నుంచి ఈ పెళ్ళి మోహన్ బాబుకు ఇష్టం లేదని టాక్ నడిచింది. ఇక చివరికి కొడుకు ప్రేమ కోసం ఆయన కూడా తలవొగ్గి ఈ పెళ్ళికి హాజరు అయ్యాడు. ఇక కొత్త జంటకు అభిమానులతో పాటు ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.