Manchu Manoj: డేవిడ్ రెడ్డి కోసం మనోజ్ షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు మనోజ్ ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను ఆయన ఆకట్టుకుంటుంటారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ ఫ్యాన్స్ సహా ప్రేక్షకులను, సినీ వర్గాలను ఆకర్షిస్తున్నాయి. మనోజ్ తన ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించిన అప్డేట్ను ఆయన షేర్ చేసుకున్నారు. రాబోయే సినిమాల కోసం గత మూడు వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నానని ఆయన ఈ పోస్ట్‌లో వెల్లడించారు. అలాగే ఆయన పోస్ట్ చేసిన వర్కవుట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటుడిగా మనోజ్ చూపిస్తోన్న పట్టుదల, కృషిని అందరూ అభినందిస్తున్నారు. ఆ పోస్ట్‌లో మనోజ్ తన తీసుకున్న నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండటానికి సాకులు వెతకకుండా వాటిని పక్కకు పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు.
Also Read: Sri Vishnu : వారం గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ కొట్టిన శ్రీ విష్ణు..
Also Read
“మూడు వారాల క్రితం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక సౌకర్యంతో రాజీ పడటం లేదు. ఇక సాకులు చెప్పాలని అనుకోవటం లేదు. కేవలం కష్టం మాత్రమే,” అని ఆయన రాశారు. ఇదే క్రమంలో యాక్షన్ సినిమాలు చేయడం ఎంత కష్టమో కూడా ఆయన వివరించారు. “యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ నటించలేరు. ప్రతి పంచ్, దెబ్బ తగిలినప్పుడు పడిపోవటం, ప్రతి దెబ్బకు మీ శరీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు,” అని ఆయన అన్నారు. ఇకపై కేవలం లుక్ కోసం కాకాకుండా..శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని ఆయన చెప్పారు. తన లక్ష్యం “ ధృడమైన వ్యక్తి”లా తయారవడం అని పేర్కొన్నాడు. ఈ అప్డేట్ను “వీక్ 3” అని పేర్కొంటూ, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, కానీ కేవలం 21 రోజుల్లోనే తాను పూర్తిగా వేరే వ్యక్తిలా అనిపిస్తున్నానని మనోజ్ తెలియజేశారు. మంచు మనోజ్ చేస్తోన్న డేవిడ్ రెడ్డి మూవీ తన కెరీర్లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాను హనుమ రెడ్డి యెక్కంటి తెరకెక్కిస్తున్నారు. 1897 – 1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథతో డేవిడ్ రెడ్డి సినిమా రూపొందుతోంది. అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఇందులో చూపిస్తున్నారు. అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తోంది.
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!