Manchu Manoj : నాకు వైజాగ్ తో మంచి అనుబంధం ఉంది. ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు నా వెనకాల ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏం చేయలేరు. చెట్టుపేరు చెప్పుకుని అమ్ముడు పోవడానికి నేను కాయ, పండు కాదు. మీ మనోజ్ ను. వైజాగ్ అంటే నాకు స్పెషల్ ప్రేమ. నా తల్లిదండ్రుల ఆశీస్సుల వల్లే ఇలా ఉన్నాను. నా సినిమాలు చాలా వరకు వైజాగ్ లోనే చేశాను. చాలా సినిమాలు ఆడలేదు. మధ్యలో గ్యాప్ వచ్చినా మీరు నా వెంటే ఉన్నారు. మళ్లీ మనోజ్ 2.0 ఉండాలనుకున్నాను. ఎలా రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాను.
Read Also : Mirai : పాన్ వరల్డ్ మూవీ అవుద్ది.. మిరాయ్ పై టీజీ విశ్వ ప్రసాద్
మిరాయ్ సినిమా కథను కార్తీక్ నా దగ్గరకు తెచ్చినప్పుడు అద్భుతంగా అనిపించింది. అతని కాళ్లకు మొక్కాలనిపించింది. కానీ చిన్నోడు కావడంతో హగ్ ఇచ్చాను. బ్లాక్ స్వ్కార్డ్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. నాకు కులాలు అంటే నచ్చదు. బ్లాక్ స్క్వార్డ్ కు కూడా కులాలు అంటే నచ్చదు. విశ్వ ప్రసాద్ గారు కథను నమ్మి ఇన్ని కోట్లు పెట్టారు. మూడేళ్ల క్రితం తమ్ముడు తేజతో సినిమా చేద్దాం అన్నాను. నీ సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా చేస్తానని చెప్పా. తేజ అడిగాడు కాబట్టే ఈ సినిమా చేశా. తేజ నవ్వు చూస్తే నాకు నా కొడుకు గుర్తుకొస్తాడు అని చెప్పేవాడిని. అతని నవ్వు అంటే చాలా ఇష్టం. ఈ సినిమా పదింతలు మనల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అని తెలిపాడు మనోజ్. నేను ఎంతో ప్రేమించే పవన్ కల్యాణ్ ఓజీ వస్తోంది. మిరాయ్, ఓజీ రెండు సినిమాలు ఒకే నెలలో రావడం సంతోషంగా ఉంది అన్నాడు మనోజ్. నా భార్య మౌనికకు చాలా థాంక్స్. ఎందుకంటే మూడేళ్లు ఎలాంటి సినిమాలు చేయకపోయినా వాళ్లు నా వెనకాల నిలబడ్డారు అంటూ ఎమోషనల్ అయ్యాడు మనోజ్.
Read Also : Rithika Nayak : మిరాయ్ హీరోయిన్ రితిక నాయక్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
