David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ నుంచి క్రేజీ లీక్ వైరల్!

Manchu Manoj, David Reddy Movie,

Manchu Manoj, David Reddy Movie,

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చాలా కాలం తర్వాత వెండితెరపై ఫుల్ లెంగ్త్ హీరోగా రీ-ఎంట్రీ ఇస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy). ప్రముఖ దర్శకుడు హనుమరెడ్డి యక్కంటి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా, బ్రిటిష్ వారిపై తిరగబడిన ఒక పవర్‌ఫుల్ యోధుడి కథాంశంతో రూపొందుతోంది. అయితే ఈ మూవీ నుండి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. ‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో ఒక పవర్‌ఫుల్ స్పెషల్ గెస్ట్ రోల్ (Guest Appearance) ఉందట. కథను ముగించే క్రమంలో వచ్చే ఈ సర్ప్రైజ్ పాత్రలో టాలీవుడ్‌కు చెందిన ఒక పాపులర్ యంగ్ హీరో కనిపించబోతున్నట్లు సమాచారం. కేవలం వచ్చి వెళ్లే అతిథి పాత్రలా కాకుండా.. క్లైమాక్స్‌లో వచ్చే అత్యంత కీలకమైన, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అంతా ఈ యంగ్ హీరో పాత్ర చుట్టూనే నడుస్తుందని టాక్. మంచు మనోజ్, ఆ యంగ్ హీరో కలిసి బ్రిటిష్ సైన్యంతో పోరాడే ఈ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆ యంగ్ హీరో ఎవరనేది ప్రస్తుతానికి చిత్ర యూనిట్ అత్యంత రహస్యంగా ఉంచింది.