RaviMohan : జయంరవి చెప్పిన మూడక్షరాల ఇడ్లి నటి ఆమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై, భార్య ఆర్తితో నడుస్తున్న విడాకుల వివాదం అలాగే సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాలు పూర్తిగా సద్దుమణిగి విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు తాను ఎలాంటి కొత్త సినిమాలు చేయనని ఆయన స్పష్టం చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో జయం రవి తన ఆవేదనను పంచుకుంటూ.. “నా పిల్లలను నన్ను కనీసం చూడనివ్వడం లేదు. వాళ్ల దగ్గర ఉన్న ఫోన్లను కూడా లాక్కున్నారు. చివరకు స్కూల్‌కి కూడా బాడీగార్డ్స్ తో పంపిస్తున్నారు. నా పిల్లలు ఈ వీడియో చూడాలి.. వాళ్ల తండ్రి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడో తెలుసుకోవాలి” తనను మానసికంగా వేధించడానికే పిల్లలను దూరం పెడుతున్నారని, సోషల్ మీడియాలో తన ప్రతిష్టను దిగజార్చడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం కొందరు పనిచేస్తున్నారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి, వాళ్లకు డబ్బులు ఇచ్చి నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇవన్నీ నాకు తెలియవనుకుంటున్నారా? ఒక ‘మూడక్షరాల ఇడ్లీ నటి’ వెనుక ఉండి ఈ డ్రామా అంతా నడిపిస్తోంది. గాయని కెనీషాను కూడా వెళ్లగొట్టారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
జయం రవి మాట్లాడిన ఆ ‘మూడక్షరాల ఇడ్లీ నటి’ (తమిళంలో ఖుష్బూ పేరు మూడు అక్షరాలు ఉండటం, తమిళనాడులో ఆమెపై ఉన్న క్రేజ్‌తో ఇడ్లీలకు ఆమె పేరు పెట్టడం తెలిసిందే) మరెవరో కాదు సీనియర్ నటి ఖుష్బూ సుందర్ అంటూ నెటిజన్లు, రవి అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఆర్తి కుటుంబానికి ఖుష్బూ అత్యంత ఆప్తురాలు కావడంతో ఈ వివాదం వెనుక ఆమె హస్తం ఉండి ఉండవచ్చని అభిమానులు అనుమానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో కోలీవుడ్‌లో జయం రవి విడాకుల వివాదం మరో కొత్త మలుపు తిరిగింది.
తాజావార్తలు
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..