Site icon NTV Telugu

Manchu Manoj: హీరోల కొడుకు‌లే కాదు.. ఎవరైనా హీరోలు కావొచ్చు

Manoj

Manoj

ఇండస్ట్రీలో రాణించాలనే తపన ఉంటే ఎవరైనా హీరోలు అవొచ్చని నటుడు మంచు మనోజ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆయన కీలక పాత్రలో నటించిన మిరాయ్ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మ నన్ను హత్తుకొని భావోద్వేగానికి గురైంది. నేను పోషించిన మహావీర్ లామా పాత్రపై ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది. అలాగే మా అక్క కూడా నాకు ప్రశంసలు అందించింది. కుటుంబసభ్యులతో కలిసి ఈ సినిమా చూడటం నాకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం” అని మనోజ్ తెలిపారు. అభిమానుల మద్దతు గురించి మాట్లాడుతూ, “నేను విజయం సాధించాలని నా అభిమానులు కోరుతున్నారు. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఇప్పుడు నాకు ఇంత పెద్ద కుటుంబం ఉందని గర్వంగా చెప్పగలను” అన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ గురించి ప్రస్తావిస్తూ, “ఇండస్ట్రీలో ఇలాంటి నిర్మాతలు చాలా అరుదు. రాజీపడకుండా సినిమాలు చేస్తున్నారు” అని ప్రశంసించారు.

Also Read : Ileana : సెట్‌లో ఆ డైరెక్టర్ అలా చేయడంతో ఏడ్చేసా..

ఇటీవల వచ్చిన హిట్స్‌పై మాట్లాడుతూ, “సుందరకాండ సూపర్ హిట్ అయింది. తర్వాత యూట్యూబర్ మౌళి చేసిన లిటిల్ హార్ట్స్ బ్లాక్‌బస్టర్ అయింది. మౌళి నిరూపించాడు – మోహన్ బాబు కొడుకు, చిరంజీవి కొడుకు మాత్రమే కాదు, ఎవరైనా హీరో కావచ్చు. మౌళీ, నీ సినిమాలో ఎప్పుడైనా విలన్ పాత్ర ఉంటే నేను చేస్తాను. ఆ తర్వాత మా మిరాయ్ సంచలనం సృష్టిస్తోంది. అలాగే కిష్కింధ పూరి కూడా విజయాన్ని అందుకుంది. ఒకేసారి రెండు సినిమాలు హిట్ అవ్వగలవని నిరూపించాం” అన్నారు. అలాగే రానున్న ఓజీ గురించి మాట్లాడుతూ, “ఈ నెల తెలుగు సినిమా ఇండస్ట్రీకి మర్చిపోలేనిది. పవన్ కళ్యాణ్ గారి ఓజీ కొత్త రికార్డులు సృష్టిస్తుంది” అని మనోజ్ ధైర్యంగా చెప్పుకొచ్చారు. తన అప్‌కమింగ్ ప్రాజెక్టులపై మాట్లాడుతూ, “తరువాత డేవిడ్ రెడ్డితో ఒక యాక్షన్ స్టోరీ చేస్తున్నాను. అది బ్రిటిష్ కాలం నాటి కథ. తర్వాత అబ్రహం లింకన్, రక్షక్ చిత్రాలు చేస్తాను” అని తెలిపారు.

Exit mobile version