Ileana : సెట్‌లో ఆ డైరెక్టర్ అలా చేయడంతో ఏడ్చేసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ఒక్కప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన గోవా బ్యూటీ ఇలియానా, తెలుగు సినిమాలకు దూరంగా ఉండి చాలా కాలం అవుతుంది. అనంతరం కోలీవుడ్, బాలీవుడ్‌లలో కొన్ని చిత్రాలు చేసిన ఆమె, తన విదేశీ ప్రియుడిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిగా కొత్త జీవితం ప్రారంభించింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగతం, వృత్తిగతం ఇలా అనేక విషయాలను పంచుకుంది. అందులో ముఖ్యమైన అంశం ఆమె తొలి హిందీ చిత్రం బర్ఫీ సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవం.
Also Read : Shreya Dhanwanthary : ఇస్లామోఫోబిక్ వీడియో పై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి ఫైర్
Also Read
ఇలియానా మాట్లాడుతూ.. ‘ ‘బర్ఫీ’ మూవీ సెట్ లో దర్శకుడు అనురాగ్ బసుతో నాకు ఒకసారి ఘర్షణ ఎదురైంది. ఆ రోజు చాలా హ్యాపీగా సెట్‌కి వెళ్లాను. కానీ అప్పటికే బసు సర్ మానసికంగా బాగోలేరు, ఏదో టెన్షన్‌లో ఉన్నారు. నేను వెళ్ళగానే నాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దాంతో నేను షాక్ అయ్యాను. నిజంగా చాలా బాధపడ్డాను. ఆ సమయంలో ‘దాదా.. వినండి.. నేను ఈ పాత్రకు సరైన దానిని కాదని మీరు అనుకుంటే.. నా వర్క్ విషయంలో మీరు సంతోషంగా లేకుంటే నేను వెళ్ళిపోతాను. నేను మీ పై దావా వేయబోవడం లేదు. నేను వెళ్తున్నానని చెప్పాను. ఒక దశలో ఏడుస్తూ నిర్మాతకు కాల్ చేయాలనిపించిన సందర్భం కూడా ఉన్నాయి. కానీ తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుని, అనురాగ్ బసుతో ఎలాగోలా అడ్జస్ట్ అయి సినిమా పూర్తి చేశా. చివరికి బర్ఫీ చిత్రానికి జాతీయ అవార్డు రావడం నాకు ఎంతో గర్వంగా అనిపించింది’ అని ఇలియానా పేర్కొంది. ఆమె మాటల్లో, “క్రియేటివ్ రంగంలో ఎవరికైనా ఏమి నచ్చుతుందో, ఏమి నచ్చదో చెప్పలేం. కానీ ఆ అనుభవం నాకు బలాన్ని ఇచ్చింది” అని కాన్ఫిడెంట్‌గా వెల్లడించింది.
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!