మంచు లక్ష్మీ .. చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు .. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు.. మంచు మనోజ్ , మంచు విష్ణుల అందాల అక్క.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానూల చేత ముద్దుగా మంచు లక్ష్మీ అక్క అని పిలిపించుకుంటూ ఉంటుంది. ఇక తానూ ఎక్కడికి వెళ్తున్నా.. ఏం చేస్తున్నా అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఉండే మంచు లక్ష్మీకి తన కిడ్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందట.. అది ఎందుకు రావాల్సి వచ్చిందో అని తాజాగా ట్వీట్ చేస్తూ చెప్పుకొచ్చింది.
మంచు లక్ష్మీ కొన్నిరోజులు ఇంటికి దూరంగా టూర్ ప్లాన్ చేసింది. అయితే ఎక్కడికి వెళ్తుంది అనేది చెప్పకుండా ఎయిర్ పోర్ట్ లో ప్రజెంట్ ఏం చేస్తుందో మాత్రం చెప్పుకొచ్చింది. ” నేను ఎయిర్ పోర్టు లాంజ్ లో ఎదురుచూస్తున్నాను.. ఆకలికాకపోయినా కూడా ఇక్కడ ఉన్నవన్నీ లాగించేస్తున్నాను. ఎందుకంటే ఈ టికెట్ కొనడానికి నా కిడ్నీ అమ్ముకోవాల్సివచ్చింది. అందుకే ఆ టికెట్ డబ్బులకు న్యాయం చేసేందుకు అలా ఆకలి కాకపోయినా కూడా తింటున్నా” అంటూ తనదైన రీతిలో ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్ కి నెటిజన్స్ సైతం తమదైన శైలిలో నవ్వులు పూయించారు. ఆ.. మంచక్క .. నువ్వు కూడా మా బ్యాచ్ యేనా అని కొందరు అంటుండగా .. మరికొందరు అక్క మీరు రిచ్ కదా .. మీరు కూడా ఇలా చేస్తారా అని అడిగారు. దానికి సమాధానంగా లక్ష్మీ ” మా నాన్న రిచ్ తమ్ముడు .. నేను కాదు” అంటూ కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి.
