Manasa Chowdary: చిత్తూరు పిల్ల.. మొదటి సినిమాతోనే చితక్కొట్టేలా ఉందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manasa Chowdary: యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం బబుల్‌గమ్. ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరో తెలుగు అమ్మాయి టాలీవుడ్ కు పరిచయమవుతుంది. ఆమె. మానస చౌదరి. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ మానస.. తన మొదటి సినిమా విశేషాలను పంచుకుంది.
” నా జర్నీ గురించి చెప్పాలంటే.. నేను చిత్తూరు జిల్లా పుత్తూరులో పుట్టాను. చెన్నైలో పెరిగాను. నాన్న బిజినెస్ చేస్తారు. నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. పరిశ్రమలోకి వెళ్తానని చెప్పినపుడు ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది. చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ స్టార్ట్ చేశాను. ఒక స్నేహితుడి ద్వారా దర్శకుడు రవికాంత్ గారికి నా ప్రొఫైల్ సెండ్ చేశాను. ఆయనకి నచ్చి టీం నుంచి నాకు కాల్ వచ్చింది. తర్వాత ఫోటో షూట్ చేశాం. అలా జర్నీ మొదలైయింది. మొదటి సినిమా అనుభవం చాలా సరదాగా అనిపించింది. రవికాంత్ అండ్ టీం చాలా సరదాగా వుంటారు. బబుల్‌గమ్ కథ లవ్, రెస్పెక్ట్ గురించి వుంటుంది. సినిమా యూనిట్ కూడా నాపై ఎంతో ఆప్యాయత, గౌరవాన్ని చూపించింది. సెట్ లో చాలా కంఫర్ట్బుల్ గా చూసుకున్నారు. మోడలింగ్ వలన నాకు కెమరా ఫియర్ లేదు. సినిమా విషయానికి వస్తే దర్శకుడి విజన్ కి న్యాయం చేస్తున్నానా లేదా అనే దానిపైనే దృష్టి పెట్టాను. ఇక బబుల్ గమ్ కథను రవికాంత్ చెప్పినపుడు చాలా నచ్చింది. 22 ఏళ్ల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉంటారో అలానే అనిపించింది. చాలా రియలిస్టిక్ గా వుండే కథ. ఇందులో వుండే సన్నివేశాలని బోల్డ్ అనడం కంటే చాలా బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేశారని చెప్పాలి.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
హీరో సుమగారి అబ్బాయి అని తెలియగానే భవిష్యత్ చాలా బావుంటుందని అనిపించింది. మరో ఆలోచన లేకుండా సినిమా చేశాను. ఇందులో జాన్వి పాత్రలో కనిపిస్తా. తను ఫ్యాషన్ డిజైనర్. దర్శకుడు ఈ పాత్రకు సహజంగా కనిపించే నటులనే ఎంపిక చేసుకున్నారు. ఇందులో రియల్ లైఫ్ కి దగ్గరగా వున్న పాత్రలనే తీసుకున్నారు. ఫోటో షూట్ జరిగినప్పుడు నా లైఫ్ కి సంబధించిన కొన్ని విషయాలని అడిగి తెలుసుకున్నారు. పాత్రని సహజంగా తీర్చిదిద్దడానికి వాటిని కూడా మౌల్డ్ చేశారనిపించింది. గతంలో ఏమోజి అనే వెబ్ సిరిస్ చేశాను. అయితే అప్పటికి నటన నాకు చాలా కొత్త. బబుల్‌గమ్ విషయానికి వస్తే చాలా మెరుగయ్యాను. పాత్ర స్వరూపాన్ని అర్ధం చేసుకొని చేశాను. జాన్వీ పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. అలాగే రోషన్ నుంచి కూడా చాలా నేర్చుకున్నాను.సుమ గారు సినిమా చూశారు. చాలా బాగా చేశాని చెప్పారు. ట్రైలర్ టీజర్ చూసిన ఆడియన్స్ కూడా చాలా అందంగా, సహజంగా కనిపిస్తున్నాను ప్రశంసించారు. రవికాంత్ గారి క్షణం సినిమా నా ఫేవరేట్. ఆయన్ని కలసి వెంటనే ఈ సంగతి చెప్పాను.ఇందులో కొన్ని ఇంటెన్స్ ఎమోషన్ వున్న సన్నివేశాలు వున్నాయి. ఆ ఇంటెన్స్ ని కొనసాగించడం కొంత సవాల్ గా అనిపించింది. జాన్వి పాత్రలో అన్ని ఎమోషన్స్ వున్నాయి. నటించడానికి ఆస్కారం వుండే పాత్ర దక్కడం చాలా ఆనందంగా వుంది. బబుల్‌గమ్ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది.
రోషన్ కు, నాకు ఇది తొలి చిత్రం. రోషన్ కి నటనపై మంచి పట్టు వుంది. ఈ సినిమాతో తను నేర్చుకోవడంతో పాటు నాకు కూడా చాలా విషయాలు నేర్పించాడు. దాదాపు ఏడాది పాటు ఈ జర్నీ గడిచింది. చాలా మెమరబుల్ జర్నీ ఇది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీచరణ్ వండర్ ఫుల్ కంపోజర్. బబుల్‌గమ్ కు మెమరబుల్ ఆల్బమ్ ఇచ్చారు. పాటల్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడే పరిశ్రమలోకి వచ్చాను. ఇది కావాలి..అది వద్దు అనేది ఏమీ లేదు. భవిష్యత్తులో మంచి కథలు చేయాలని వుంది. నాకు అన్ని జోనర్స్ ఇష్టం. అన్ని జోనర్స్ చేయాలని వుంది” అని చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమాతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!