మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ గారు సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ అవుతుంది. అయితే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు సినిమా యూనిట్ సిద్ధమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ మరో కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి ఒక సంచలన అప్డేట్ తెరమీదకు వచ్చింది.
Also Read: The Raja Saab: నేటి నుంచి ‘ది ఓల్డ్ రాజా సాబ్’ సీన్స్.. నిర్మాత కీలక ప్రకటన!
అదేమిటంటే, ఈ సినిమా చూసిన తర్వాత బుక్ మై షో లో రివ్యూ అండ్ రేటింగ్ ఇవ్వడానికి వీల్లేదని కోర్టు తీర్పునిచ్చింది. నిజానికి ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలను కావాలనే బుక్ మై షో లో రేటింగ్స్ తగ్గిస్తున్నారని, యాంటీ ఫ్యాన్స్ తక్కువ రేటింగ్ తో రివ్యూస్ పబ్లిష్ చేస్తున్నారని కొంతమంది నిర్మాతలు తెరమీదకు వచ్చి మాట్లాడిన సంగతి గుర్తుండే ఉంటుంది.
ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్న మెగాస్టార్ సినిమా టీం, ఇప్పుడు ఈ సినిమా విషయంలో సినిమా చూసినవారు, చూడని వారు ఎవరూ కూడా తమ సినిమాకి బుక్ మై షో లో రివ్యూ కానీ, రేటింగ్ కానీ ఇవ్వకూడదని.. ఈ మేరకు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు.
Also Read: Prabhas: దెబ్బేసిన సెంటిమెంట్.. పాపం ప్రభాస్!
ఈ విషయాన్ని బుక్ మై షో దృష్టికి తీసుకెళ్లడంతో, ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో, ఈ సినిమాకి బుక్ మై షో లో రివ్యూస్ కానీ, రేటింగ్స్ కానీ ఇచ్చే వీలు లేకుండా బుక్ మై షో ఆప్షన్ డిజేబుల్ చేసింది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘రాజా సాబ్’ మినహా సంక్రాంతికి వస్తున్న మరో మూడు సినిమాలు కూడా ఈ మేరకు కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే రవితేజ ‘భక్తులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలకు కూడా బుక్ మై షో లో రివ్యూస్ కానీ, రేటింగ్స్ కానీ ఇచ్చే అవకాశం ఉండదన్నమాట. 