Site icon NTV Telugu

JR. NTR : మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు ‘డబుల్’ ధమాకా

Young Tigar

Young Tigar

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా కంప్లీట్ యాక్టర్ అనేదానికి తారక్ బెస్ట్ ఉదాహరణ. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి వార్ 2 అలాగే డ్రాగన్. కాగా ఈ నెల 20న తారక్ బర్త్ డే రాబోతుంది. దీంతో బర్త్ డే కానుకగా ఏదైనా స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందేమో అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ సినిమా కు సంబందించి గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్.

Also Read : Malaika Arora : పసందైన ఫొటోస్ తో మత్తెక్కిస్తున్న ‘మలైకా అరోరా’

ఇక ఇప్పుడు తారక్ అభిమానులకు మరోక గుడ్ న్యూస్ కూడా రాబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. వీరిద్దరు ఒకే ఫ్రెమ్ లో కనిపించే సీన్స్ కు బిగ్ స్క్రీన్స్ బ్లాస్ట్ అవుతాయని బీ టౌన్ లో వినిపిస్తోంది. తారక్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. ఇక ఈ ఇద్దరి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే ఆడియెన్స్ విజువల్ ట్రేట్ అని చెప్పడంలో సందేహం లేదు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్  ఫస్ట్ లుక్ ను ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. సో ఈ సారి యంగ్ టైగర్ బర్త్ డే ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అనే చెప్పాలి.

 

Exit mobile version