Mamta Mohandas: దానికి లొంగిపోలేదంటూ.. మమతా స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamta Mohandas Gives Clarity On Rumours: నటి మమతా మోహన్‌దాస్ గుర్తుందా? ‘యమదొంగ’తో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ, మొదట్లో కొన్నాళ్లు బాగానే సందడి చేసింది. అయితే.. ఆ తర్వాత క్యాన్సర్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలో.. సోషల్ మీడియాలో ఆ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ, తన ఆరోగ్యం గురించి అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. సుదీర్ఘకాలం క్యాన్సర్‌తో పోరాడి, చివరికి గెలిచింది. క్యాన్సర్ నుంచి బయడపడ్డాక, తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ, తన సెకండ్ ఇన్నింగ్స్‌ని విజయవంతంగా కొనసాగిస్తోంది.
అయితే.. కొన్ని రోజుల నుంచి మమతా ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. ఆ అమ్మడు మరోసారి క్యాన్సర్ బారిన పడిందని, రోజురోజుకీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని ప్రచారం జరుగుతోంది. మునుపటిలాగా క్యాన్సర్‌తో పోరాటే శక్తి లేకపోవడంతో.. ఆ వ్యాధికి మమతా లొంగిపోయిందని కూడా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మమతా ఈ వార్తలపై తాజాగా స్పందించింది. తాను మళ్లీ క్యాన్సర్ బారిన పడలేదని, చాలా ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేసింది. అంతేకాదు.. తాను తన పని చేసుకుంటూ సంతోషంగా ఉన్నానని, క్లిక్కుల కోసం ఇలాంటి చెత్త వార్తలు రాయకుండా మీరు కూడా మీ పని చేసుకుంటే బాగుంటుందని గాసిప్‌రాయుళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
‘‘నేను మళ్లీ క్యాన్సర్ బారిన పడినట్టు వస్తున్న ఫేక్ వార్తలు చూసి.. నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు. నాకు వాళ్ల దగ్గర నుంచి మెసేజెస్, మెయిల్స్ వస్తున్నాయి. నేను ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చానని, అందులో నేను మరోసారి క్యాన్సర్ బారిన పడ్డానని, ఈసారి ఫైట్ చేసే శక్తి లేక దానికి లొంగిపోయానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. నేను చాలా ఆరోగ్యంగానే ఉన్నాను. నా ఆరోగ్యంపై వస్తున్న ఫేక్ వార్తలను నమ్మకండి’’ అంటూ ఇన్‌స్టాలో మమతా క్లారిటీ ఇచ్చింది. అలాగే, తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పేందుకు తాజా ఫోటోలను సైతం ఇన్‌స్టాలో షేర్ చేసింది.
తనపై గతంలోనూ ఇలాంటి వార్తలు చాలా వచ్చాయని, ఇప్పుడు మరింత పెచ్చుమీరిపోయాయని, వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే తాను ఇలా స్పందించాల్సి వస్తోందని మమతా పేర్కొంది. ఇప్పుడు మీకు సమాధానం దొరికింది కాబట్టి, నా మీద తప్పుడు వార్తలు రాయడం మానేసి మీ పనులు చూసుకోండని గాసిప్స్ రాసే వారికి గట్టిగా సమాధానం ఇచ్చింది. తనలాగే కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు, జీవితం విలువ ఏంటో అందరికీ తెలుస్తుందని హితవు పలికింది.
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!