Site icon NTV Telugu

Mamitha Baiju: ఆ డైరెక్టర్ నన్ను సెట్ లో అందరి ముందు కొట్టాడు.. హీరో సూర్య కూడా..

Mamitha

Mamitha

Mamitha Baiju: కొందరు డైరెక్టర్లకు పర్ఫెక్షన్ అనేది చాలా ముఖ్యం. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా వారు తిట్టడంతో ఆగరు.. నటీనటులని కూడా చూడకుండా చేయెత్తుతారు. తెలుగులో డైరెక్టర్ తేజ.. తన దర్శకత్వంలో నటించిన హీరో హీరోయిన్లందరిని కొట్టినవాడే. ఇప్పుడు ఆయన స్కూల్ నుంచి వచ్చిన హీరోలందరూ స్టార్లుగా మారారు. ఇక ఇప్పుడు వారిని అడిగినా ఆయన పర్ఫెక్ట్ గా సీన్ రావడం కోసం ఏదైనా చేస్తారు అని చెప్తారు.ఇక తేజ లానే తమిళ్ లో డైరెక్టర్ బాలా కూడా నటీనటులను కొడతారని టాక్. తాజాగా ఒక యంగ్ హీరోయిన్ అందరిముందు బాలా తనను తిట్టి, కొట్టినట్లు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఇలాంటి విషయాలు స్టార్ డమ్ రాకముందు చెప్తే.. ఎవరు నమ్మరేమో కానీ, ఒక్కసారి ఒక్క హిట్ పడ్డాకా చెప్తే మాత్రం అందరూ నమ్మేస్తారు. ఇప్పుడు ఆ హీరోయిన్ కూడా అదే పని చేసింది. అసలు ఆ హీరోయిన్ ఎవరు అనేగా అందరి డౌట్.. రీసెంట్ క్రష్ మమిత బైజు. మలయాళ సినిమా ప్రేమలు చిత్రంతో అందరి మనసులను దోచుకున్న ఈ చిన్నది.. ఈ సినిమా హిట్ తరువాత.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరీర్ లో జరిగిన అవమానాలను, అనుభవాలను నెమరువేసుకుంది.

మమిత ఈ సినిమా కన్నా ముందు బాలా- సూర్య కాంబోలో వచ్చిన అచలుడు అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నుంచి సూర్య, మమిత ఇద్దరూ తప్పుకున్నారు. ఇక ప్రేమలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమా నుంచి ఆమె ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరించింది. ” ఆ సినిమాలో నేనొక మ్యూజిక్ పరికరాన్ని వాయిస్తూ ఉండాలి. ఆ సీన్ షూట్ చేస్తున్నారు. నాకు దాన్ని వాయించడం ఎలాగో తెలియదు. నేను అప్పటికే ప్రాక్టీస్‌ చేసిన అమ్మాయిలా నటించాలా? లేదంటే మొదటిసారి దాన్ని ప్రయత్నిస్తున్నట్లు యాక్ట్‌ చేయాలా? అని బాలా సర్ ను అడిగాను. ఆయన.. అనుభవం ఉన్న అమ్మాయిలా యాక్ట్ చేయాలి. వెనుక ఒక అమ్మాయి వాయిస్తుంటే.. ఆమెను చూపించి అదుగో అలా వాయించాలి అని చెప్పారు. నేను ఓకే అన్నాను. వెంటనే టేక్ అన్నారు. నేను షాక్ అయ్యాను. మూడు టేకులు తీసుకున్నాను.. వాళ్లు ఏం పడుతున్నారో అర్ధమే కాలేదు. మధ్యమధ్యలో బాలా సర్ తిడుతున్నారు. అయితే తాను టేకులో ఉన్నప్పుడు తిడతాను.. అదంతా సీరియస్ గా తీసుకోవద్దని చెప్పడంతో నేను వాటిని మనసులో పెట్టుకోలేదు. ఆ తరువాత ఆయన సెట్ లో అందరిముందు నన్ను కొట్టారు కూడా.. సూర్య సర్ కు కూడా ఇది తెలుసు. కానీ, బాలాసర్ తో ఆయన అంతకు ముందే వర్క్ చేశారు కాబట్టి ఏం చెప్పలేకపోయారు. కానీ, ఇది కొత్త” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version